Begin typing your search above and press return to search.
ఆ 21 మంది టాలీవుడ్ ని శాసిస్తున్నారా...?
By: Tupaki Desk | 9 Sep 2020 4:00 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతల సమస్యల పరిష్కారానికి.. సినిమాకు సంబంధించిన విషయాలలో సమస్యలు తలెత్తకుండా చూడటానికి 'ప్రొడ్యూసర్ కౌన్సిల్' మరియు 'తెలుగు ఫిలిం ఛాంబర్' అని శాశ్విత ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అయితే దానిలో ఉంటూనే సపరేటుగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కొంత మంది కలిసి ప్రొడ్యూసర్స్ ఎల్ ఎల్ పి ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మధ్య ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ లోనే మీటింగ్స్ పెడుతున్నారని తెలుస్తోంది. ఈ అయితే దీనిపై ప్రముఖ నిర్మాత, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా కారణంగా మూసివేసిన థియేటర్లను రీ ఓపెన్ చేయకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన నట్టి కుమార్.. థియేటర్లు రీ ఓపెన్ చేయకపోవడం వెనుక కొందరు ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందని.. తెరవకపోవడం వెనుక పెద్ద లాబీయింగ్ జరుగుతోందని ఆరోపించారు.
నట్టి కుమార్ మాట్లాడుతూ.. 'చిన్న సినిమాలు నాశనం అయిపోవాలని కొంతమంది పెద్దలు ఆడుతున్న డ్రామా ఇది. చిన్న నిర్మాతలు బ్రతకకూడదు.. చిన్న నిర్మాతలు ఉండకూడదు. సపోర్ట్ లేనివారు ఇండస్ట్రీలో ఉండకూడదు అనుకుంటున్నారు. ఎల్ ఎల్ పి అని ఒకటి పెట్టారు. కొన్ని రోజులు పోతే మీరు రావడానికి కూడా మెంబెర్ షిప్ కావాలని అడుగుతారు. పేపర్ మాదే.. ఛానల్స్ మావే.. రోడ్డు మీద హోర్డింగ్డ్ మావే.. పేస్టింగులు మావే అంటూ కొత్త పద్ధతి తీసుకొస్తున్నారు. అక్కడ 10 రూపాయలకు వస్తే 50 రూపాయలు వేస్తారు. చిన్న నిర్మాతలు రోడ్డున పడాలా? ఈ రోజుల్లో పబ్లిసిటీ చేయాలంటే ఓ చిన్న సినిమాకి 50 లక్షలు అవుతోంది. నిజంగా ఆ 50 లక్షలు ఛానళ్లకు ప్రెస్ కి వెళ్తుందంటే మేము సంతోషిస్తాం. కానీ వాటిలో 10 లక్షలు అయితే మిగతా 40 లక్షలు వీళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి. ఎల్ ఎల్ పి అని 21 మంది ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్.. 1941 నుంచి ఉన్న తెలుగు ఫిలిం ఛాంబర్ లను మూయించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇండస్ట్రీ చిన్న సినిమాల వల్లనే బ్రతుకుతోంది. చిన్న సినిమాల వల్లనే గవర్నమెంట్ కి టాక్స్ వెళ్తోంది. చిన్న సినిమాల వల్లనే కార్మికులు బ్రతుకుతున్నారు. పబ్లిసిటీ విషయంలో కూడా చిన్న నిర్మాతల డబ్బులే ఉంటాయి. నెలలో 26 రోజులు చిన్న సినిమాలతో థియేటర్స్ రన్ చేస్తే 4 రోజులు పెద్ద సినిమాలతో రన్ చేస్తున్నారు. అన్ని తెలిసినా ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ ఎందుకు నోరు మెదపడం లేదు. మీ లాబీయింగ్ ఏంటి? లీజు ఓనర్స్ కి భయపడా? మాఫియాకి భయపడా?. డిస్ట్రిబ్యూటర్స్ కి చిన్న నిర్మాతలకు మీరు అన్యాయం చేస్తున్నారు. థియేటర్లు తెరవకపోతే రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఉద్యమం మొదలవుతుంది'' అని ఘాటుగా స్పందించారు.
అయితే నట్టికుమార్ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారితీసాయి. చిన్న నిర్మాతలను రోడ్డున పడేస్తున్నారు.. చిన్న నిర్మాతలు ఉండకూడదనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.. చిన్న సినిమాలను చంపేస్తున్నారు అనే కామెంట్స్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వస్తున్నవే అయినప్పటికీ నట్టికుమార్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పుడు నిజంగానే ఆయన ఆరోపిస్తున్నట్లు ఎల్ ఎల్ పి పేరుతో ఆ 21 మంది ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలను ఇబ్బదులకు గురి చేస్తున్నారా అని అందరూ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇండస్ట్రీలోని చిన్న నిర్మాతలు అందరూ నట్టి కుమార్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారని తెలుస్తోంది.