Begin typing your search above and press return to search.

చరణ్‌.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ట్రోల్స్ కు స్పందించిన నాటు నాటు సింగర్‌

By:  Tupaki Desk   |   17 March 2023 4:11 PM GMT
చరణ్‌.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ట్రోల్స్ కు స్పందించిన నాటు నాటు సింగర్‌
X
నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం ఒక ఎత్తయితే ఆస్కార్‌ వేదిక పై కాలభైరవ మరియు రాహుల్‌ సిప్లిగంజ్ లు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం దక్కించుకున్నారు. లైవ్‌ పెర్ఫార్మెన్స్ తర్వాత ఆడిటోరియంలో ఉన్న వారంతా కూడా లేచి నిల్చుని అభినందించారు. గతంలో ఎప్పుడు ఆస్కార్‌ వేదికపై ఏ పాటకు దక్కని గౌరవం నాటు నాటు కు దక్కింది.

ఆస్కార్‌ స్టేజ్ పై లైవ్‌ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సింగర్‌ కాలభైరవ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నాడు. ఆ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం మరియు అక్కడ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం రావడానికి కారణం రాజమౌళి.. కీరవాణి మరియు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అంటూ పోస్ట్‌ లో పేర్కొన్నాడు.

ఆ పోస్ట్‌ లో రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ లను ప్రస్తావించకపోవడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్‌ చరణ్‌.. ఎన్టీఆర్ లు ఆ స్థాయిలో డాన్స్ చేయకుంటే కచ్చితంగా నాటు నాటు పాటకు ఆ స్థాయిలో గుర్తింపు వచ్చేదా అంటూ నెటిజన్స్ మండిపడుతూ కాల భైరవ పై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. దాంతో కాలభైరవ తన తప్పును తెలుసుకున్నాడు.

మరో పోస్ట్‌ ను షేర్ చేసిన కాలభైరవ అందులో... నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంలో సందేహం లేకుండా రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ అన్నలు కారణం. నా ఉద్దేశ్యాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆస్కార్ స్టేజ్ పై తనకు లైవ్‌ పెర్ఫార్మెన్స్ చేయడంలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాను. తనకు చరణ్‌ అన్న.. తారక్ అన్న అంటే గౌరవం అన్నట్లుగా కాలభైరవ వివరణ ఇచ్చాడు. దాంతో అభిమానులు కాస్త కూల్ అయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.