Begin typing your search above and press return to search.
చిరు-బాలయ్య ఫ్యాన్స్ కి 'నాటు నాటు' ట్రీట్!
By: Tupaki Desk | 6 April 2022 8:41 AM GMTపాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' లో 'నాటు నాటు' పాట ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. సినిమా రిలీజ్ కి ముందే 'నాటు నాటు' ప్రేక్షకాభిమానుల్ని ఓ ఊపు ఊపేసింది. పాటలో చరణ్ .. తారక్ డ్యాన్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. హుక్ స్టెప్పు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది . 'నాటు నాటు' స్టెప్పులేయని అభిమాని లేడు. సోషల్ మీడియాలో ఆ పాట..స్టెప్పులు ట్రెండింగ్ లో నిలిచాయి.
బాలీవుడల్ స్టార్ హీరలు సల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్ సైతం ఈ హుక్ స్టెప్పు వేసి ఆకట్టుకున్నారు. ఇక 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ పార్టీలో దర్శకుడు రాజమౌళి-మరో దర్శకుడు అనీల్ రావిపూడి కలిసి స్టేజ్ పై 'నాటు నాటు' స్టెప్ ని దించేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈవేడుకలోకి మెగాస్టార్ చిరంజీవి-నటసింహ బాలకృష్ణని సైతం అభిమానులు లాగుతున్నారు.
'నాటు నాటు' స్టెప్పుకు చిరంజీవి- బాలయ్య ముఖాల్ని మార్పింగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.ఇద్దరి హీరోల అభిమానులు ఆ మార్పింగ్ వీడియోని ఎవరి సోషల్ మీడియా ఖాతాల్లో వారు పోస్ట్ చేసి షేర్ చేయడం విశేషం. నిజానికి బాలయ్య-చిరంజీవి అభిమానుల మధ్య అస్సలు పొసగదు. కానీ ఈ పాట విషయంలో అభిమానులే తమ హీరోల్ని తెగ ప్రోత్సహిస్తున్నారు.
పాటకు సంబంధించిన మార్పింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మరి నిజంగా బాలయ్య-చిరంజీవి ఒకే వేదికపై కలిస్తే మాత్రం 'నాటు నాటు' తప్పక పడుతుందని చెప్పొచ్చు. అప్పుడు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కానీ ఆ సమయమే రావాలి. చిరంజీవి-బాలయ్య ఇలాంటి విషయాల్లో చాలా జోవియల్ గా ఉంటారు.
స్టేజ్ పై స్టెప్పులేయడానికి ఏ మాత్రం ఆలోచించరు. చిరంజీవి సై అంటే బాలయ్య సై సై అంటారు. బాలయ్య ఎంత జోవియల్ గా..ప్రాక్టికల్ గా ఉంటారు? అనడానికి ఎన్నో సందర్భాల్ని ఉదహరించ వచ్చు. 'ఆహా'లో 'అన్ స్టాపబుల్ 'షో అంత పెద్ద సక్సెస్ అయిందంటే కారణం బాలయ్య లో ఆ పాజిటివ్ యాంగిల్ అనే చెప్పొచ్చు.
మరి ఈ పాటల 'పుష్ప'లో 'శ్రీవల్లి' పాటంత క్రేజ్ ని రీచ్ అవుతందా? అన్నది చూడాలి. 'శ్రీవల్లి' పాట పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లోనే ఫేమస్ అయింది. విదేశీ క్రికెటర్లే శ్రీ వల్లి పాట లో స్టెప్పుల్ని దించేసారు. సోషల్ మీడియా కారణంగా ఆ పాటకి అంత రీచ్ దొరికింది.