Begin typing your search above and press return to search.

కంప్లీట్ యాక్టర్ ని బయటకు తీస్తున్న నేచురల్ యాక్టర్..!

By:  Tupaki Desk   |   27 April 2021 3:30 AM GMT
కంప్లీట్ యాక్టర్ ని బయటకు తీస్తున్న నేచురల్ యాక్టర్..!
X
నేచురల్ స్టార్ నాని 'అష్టాచమ్మా' సినిమాతో హీరోగా పరిచయమై తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో 'అలా మొదలైంది' 'పిల్ల జమిందార్' 'ఈగ' 'ఎవడే సుబ్రహ్మణ్యం' 'భలే భలే మగాడివోయ్' 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' 'జెంటిల్ మ్యాన్' 'మజ్ను' 'నేను లోకల్' 'నిన్ను కోరి' 'ఎంసీఏ' 'జెర్సీ' వంటి విజయాలను అందుకున్నాడు. మినిమమ్ గ్యారంటీ హీరోగా చేతినిండా సినిమాలతో నిర్మాతల హీరో అయ్యాడు. మంచి న‌టుడిగా ఆల్రేడీ జ‌నాల గుర్తింపు సంపాదించిన నాని.. కమర్షియాలిటీ వైపు అడుగులు వేస్తున్నాడు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్న 'ట‌క్ జ‌గ‌దీష్' చిత్రంలో చాలా క‌మ‌ర్షీయ‌ల్ ఎలిమెంట్స్ ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఇది ప‌క్క‌న‌ పెడితే దీని తర్వాత వ‌చ్చే సినిమాలతో నాని తనలోని కంప్లీట్ యాక్టర్ ని బ‌య‌ట‌కు తీయాల‌ని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. నాని ప్రస్తుతం 'శ్యామ్ సింగ రాయ్' తో పాటుగా 'అంటే.. సుందరానికీ!' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన ఈ చిత్రాలకు సంబంధించిన ప్రచార చిత్రాలు చూస్తే త‌న‌లో దాగి ఉన్న న‌టుడిని పూర్తిగా బ‌య‌ట‌కు తీయ‌డానికి ట్రై చేస్తున్న‌ట్లుగా అనిపిస్తోంది.

అయితే టాలీవుడ్ లో పర్ఫార్మెమెన్స్ పరంగా కొత్తగా ట్రై చేసిన తెలుగు హీరోల్ని ఆడియెన్స్ ఎక్కువ శాతం రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రయోగాలు మంచిదే కానీ మీట‌ర్ దాటితేనే మేట‌ర్ లేద‌ని ప్రేక్షకులు థియేట‌ర్లకి దూరంగా ఉంటారు. ఇప్పుడు నాని నటిస్తున్న రెండు సినిమాలు కూడా విభిన్నమైనవే. అందులోనూ ఆయన కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో 'శ్యామ్ సింగ రాయ్' 'అంటే.. సుందరానికీ!' సినిమాలను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.