Begin typing your search above and press return to search.

శృతి ఇంట్లోని బండరాయి ఇంట్రెస్టింగ్‌ కహానీ

By:  Tupaki Desk   |   27 July 2020 7:00 AM GMT
శృతి ఇంట్లోని బండరాయి ఇంట్రెస్టింగ్‌ కహానీ
X
బాలీవుడ్‌ టాలీవుడ్‌ కోలీవుడ్‌ ఇలా అన్ని భాషల్లో హీరోయిన్‌ గా తనకంటూ మంచి పేరును దక్కించుకున్న శృతి హాసన్‌ మల్టీ ట్యాలెంటెడ్‌ అనే విషయం తెల్సిందే. సింగర్‌ గా మ్యూజిక్‌ కంపోజర్‌ గానే కాకుండా కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ గా కూడా పేరు దక్కించుకుంది. లండన్‌ లో మ్యూజిక్‌ షోలు ఇచ్చే స్థాయిలో ఈమె సంగీత ప్రావిణ్యం ఉంది. ఒక వైపు మ్యూజిక్‌ షో లు ఇస్తూనే మరో వైపు హీరోయిన్‌ గా నటిస్తోంది. తాజాగా ఈమె నటించిన బాలీవుడ్‌ మూవీ ఓటీటీ విడుదల సందర్బంగా మీడియాతో ముచ్చటించింది.

ఆ ఇంటర్య్యూలో తన ఇంట్లో ఉన్న ఒక బండరాయి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. నా డైనింగ్‌ రూంలో ఒక పెద్ద బండరాయి ఉంటుంది. ఇల్లు కట్టే సమయంలో ఆ బండరాయిని అలాగే ఉంచాము. ఆ బండరాయి డైనింగ్‌ రూంలో ఉండటం వల్ల విభిన్నమైన అనుభూతి నాకు కలుగుతుంది. ఆ బండ రాయి పక్కన కూర్చుని తింటూ ఉంటే ఒక గుహలో ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఎప్పుడు కూడా చాలా కూల్‌ గా గంభీరంగా ఉండే ఆ బండరాయి పక్కన ఉంటే పాజిటివ్‌ ఎనర్జి వస్తున్నట్లుగా అనిపిస్తుంది.

మెడిటేషన్‌ చేసినా యోగా చేసినా ఆ బండ రాయి పక్కన కూర్చుని చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నా ఇంట్లో ఆ పెద్ద బండరాయి ఒక భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇంట్లో పెద్ద బండ రాయి అంటే కాస్త ఆసక్తికర విషయమే. ఇల్లు కట్టే సమయంలో దాన్ని అలాగే ఉంచానే ఐడియా ఉంది చూశారు అది చాలా బాగుందంటున్నారు. మొత్తానికి తన ఇంట్లోని బండ రాయి గురించి ఆసక్తికర కహానీ చెప్పి అందరిని ఆశ్చర్యపర్చింది.