Begin typing your search above and press return to search.
ఫ్లాప్ డైరెక్టర్ కు మళ్లీ ఛాన్స్ ఇస్తున్న నేచురల్ స్టార్?
By: Tupaki Desk | 20 Sep 2022 5:42 AM GMTనేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న'దసరా' మూవీలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ఎస్ ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గోదావరి ఖని కోల్ మైన్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీని ఐదు భాషల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఊర మాసీవ్ పాత్రలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ ఇది.
తన కెరీర్ కి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నాని 'దసరా'పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. నాని కెరీర్ లోనే మాసీవ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని 2023 మార్చి 30న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
గత కొంత కాలంగా ఈ మూవీపైనే ప్రత్యేక దృష్టి పెట్టిన నాని మేకోవర్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ కారణంగానే తన తదుపరి ప్రాజెక్ట్ ని ఇంత వరకు ఫైనల్ చేయలేదు.
అయితే తాజాగా 'దసరా' తరువాత హీరో నాని మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ సారి తనకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడినే హీరో నాని తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంత చేసుకున్న మేర్లపాక గాంధీ త్వరలో నానితో సినిమా చేయబోతున్నాడట. గతంలో వీరిద్దరి కలయికలో 'శ్రీకృష్ణార్జున యుద్ధం' మూవీ రూపొందిన విషయం తెలిసిందే. నాని ద్విపాత్రాభినయం చేశాడు. అంతే కాకుండా ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అయితే ఆ అంచనాలకు ఈ మూవీ ఏ మాత్రం రీచ్ కాలేక నిరాశకు గురి చేసింది.
అయితే సంతోష్ శోభన్ తో చేసిన 'ఏక్ మినీ కథ' ఫరవాలేదనిపించడంతో మేర్లపాక మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడే కానీ రీసెంట్ గా నితిన్ తో 'మాస్ట్రో' చేసినా మేర్లపాక గాంధీ మరో ఫ్లాప్ ని సొంతం చేసుకున్నాడు. తాజాగా మళ్లీ సంతోష్ శోభన్ తో 'లైక్ షేర్ అండ్ సబ్స్ స్క్రైబ్' అనే విభిన్నమైన మూవీని చేశాడు. ఇది త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేర్లపాక గాంధీకి నేచురల్ స్టార్ నాని మరో అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటికి రానున్నట్టుగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.