Begin typing your search above and press return to search.
ఆస్కార్ బరిలో నేచురల్ స్టార్ మూవీ!
By: Tupaki Desk | 17 Aug 2022 10:26 AM GMTతెలుగు సినిమాకు మంచి రోజులొచ్చాయి. గత రెండు నెలలుగా వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో నిర్మాతలు భయాందోళనకు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం అందరి అంచనాల్ని తారు మారు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచాయి. ఈ సినిమాల విజయంలో టాలీవుడ్ లో కొత్త ఉత్సాహం మొదలైంది. తాజాగా విడుదలైన 'కార్తికేయ 2' కూడా ఔత్ తో పాటు నార్త్ లోనూ విజయదుందుభి మోగిస్తుండటం విశేషం.
ఈ నేపథ్యంలో తెలుగు సినిమా ఆస్కార్ బరిలో అనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో మరింత ఆనందాన్ని నింపుతున్నాయి. ఎన్నాల్లో వేచిన ఉదయం అంటూ మన వాళ్లు ఈ వార్త కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా చక్కన్న రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన 'RRR' వరల్డ్ వైడ్ గా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ మూవీపై హాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్, విదేశీ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలుస్తుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ కూడా ఆస్కార్ బరిలో నిలవబోతుండటం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు మేకర్స్ ని సర్ ప్రైజ్ కు గురిచేస్తోంది. నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఎపిక్ లవ్ స్టోరీ 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సంక్రత్యన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
వెంకట్ బోయినపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ మూడు విభాగాల్లో ఆస్కార్ నామినేట్ అయింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని కాబట్టడమే కాకుండా విమర్శలకు ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో జనవరి 21 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైన దగ్గరి నుంచి దాదాపు 10 వారాల పాటు టాప్ లో ట్రెండ్ అవుతూ వచ్చింది.
ఇంతటి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ తాజాగా ఆస్కార్ బరిలో మూడు విభాగాల్లో నామినేట్ కావడం నిజంగా విశేషం. పీరియాడిక్ ఫిల్మ్, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ వంటి మూడు విభాగాల్లో ఈ మూవీ నామినేషన్ ని సాధించింది.
హీరో నాని డ్యుయెల్ రోల్ లో నటించిన ఈ మూవీలో దేవ దాసీ వ్యవస్థపై తన రచనలతో తిరుగుబాటు చేసిన ఓ పత్రికా అధినేత కథగా ఈ మూవీని తెరకెక్కించారు. మిక్కీ జె. మేయర్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. నాని, సాయి పల్లవి తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు.