Begin typing your search above and press return to search.

వారి ఫోన్లు కూడా ఎత్తని ఆమె మీకు ఎలా ఓకే చెప్పిందయ్యా సుందరం?

By:  Tupaki Desk   |   21 April 2022 6:20 AM GMT
వారి ఫోన్లు కూడా ఎత్తని ఆమె మీకు ఎలా ఓకే చెప్పిందయ్యా సుందరం?
X
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి సినిమా జూన్‌ 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. సినిమా విడుదల తేదీకి ఇంకా నెలన్నర సమయం ఉంది. అయినా కూడా హడావుడి మొదలు పెట్టారు. చిత్ర యూనిట్‌ సభ్యులు టీజర్ విడుదల కార్యక్రమంతో మీడియా ముందుకు రావడంతో పబ్లిసిటీ కార్యక్రమాలను షురూ చేసినట్లుగా చెప్పకనే చెప్పారు.

టీజర్ విడుదల కార్యక్రమంలో నాని తో పాటు హీరోయిన్‌ నజ్రియా ఫాహద్‌ ఇంకా చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హీరో మరియు హీరోయిన్‌ లు మీడియాతో ముచ్చటించారు. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు సినిమా గురించిన విషయాలను చర్చించారు. హీరో మరియు హీరోయిన్ అని కాకుండా సినిమాలో తాము ఇద్దరం సుందరం లీలా లుగా కనిపించబోతున్నట్లుగా వారు చెప్పారు.

ఇంకా నాని మాట్లాడుతూ ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని... సినిమా కథ హీరో అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. సినిమా లో ప్రతి సన్నివేశం కూడా ఎంటర్‌ టైన్మెంట్‌ ఇస్తుంది. ట్రైలర్ లో చూసిన దానికంటే పది రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ ను సినిమా అందిస్తుందనే నమ్మకంను నాని వ్యక్తం చేశాడు. సినిమా ప్రతి ఒక్క సినీ ప్రేమికుడిని ఆకట్టుకునే విధంగా దర్శకుడు వివేవ్‌ తెరకెక్కించాడని నాని అన్నాడు.

ఇక హీరోయిన్‌ నజ్రియా గురించి నాని మాట్లాడుతూ... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఆమెను తీసుకు వచ్చేందుకు చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ మరియు నిర్మాతలు ప్రయత్నించారు. కాని చాలా మంది ఫోన్ లు కూడా కనీసం ఆమె ఎత్తకుండా తెలుగు సినిమా పరిశ్రమ కు దూరంగా ఉంది. కాని మా సినిమాలో నటించేందుకు మాత్రమే ఓకే చెప్పిందని నాని చెప్పుకొచ్చాడు.

వారందరి సినిమాలను కనీసం కథలు కూడా వినకుండానే రిజెక్ట్‌ చేసిన నజ్రియా ఎందుకు అంటే సుందరానికి సినిమా ను చేయాలని అనుకుంది... ఈ సినిమా తోనే ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని భావించింది అంటూ కొందరు సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. వారి ఫోన్లు కూడా ఎత్తని నజ్రియా మీకు ఎలా ఓకే చెప్పింది నాని అంటూ సోషల్‌ మీడియాలో చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

ఆమె ఏ ఉద్దేశ్యంతో సినిమాకు కమిట్‌ అయ్యిందో కాని ఆమె పోషించిన పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేసినట్లుగా ట్రైలర్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఒక క్రిస్టియన్ అమ్మాయిగా ఒక మోడ్రన్ అమ్మాయిగా ఆమెను సినిమా లో చూడబోతున్నాం. ఈ సినిమా తర్వాత అయినా తెలుగు లో కంటిన్యూ అవుతుందా లేదంటే మళ్లీ ఫోన్ లు ఎత్తకుండా ఉంటుందా అనేది చూడాలి.