Begin typing your search above and press return to search.
హీరోగా ఇలా.. నిర్మాతగా అలా..!
By: Tupaki Desk | 17 Jun 2022 11:30 PM GMTసినిమాల్లో నటిస్తూనే నిర్మాతగా మారిన హీరోలలో నేచురల్ స్టార్ నాని ఒకరు. వాల్ పోస్టర్ సినిమా అనే ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసి, నిర్మాత ప్రశాంతి తిపిర్నేని తో కలిసి 'అ!' 'హిట్' వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించారు నాని. న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ రూపొందించిన ఈ రెండు సినిమాలూ మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.
ఇప్పుడు నాని తన బ్యానర్ లో మరో రెండు సినిమాలు చేస్తున్నారు. 'హిట్' చిత్రానికి సీక్వెల్ గా అడవి శేష్ హీరోగా 'హిట్ 2' సినిమాని రూపొందిస్తున్నారు. అలానే నాని అక్క దీప్తి గంట ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘మీట్ క్యూట్’ అనే సినిమాను నిర్మించారు. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇవ్వబడిన ఈ సినిమా.. నాని కి ప్రాఫిటబుల్ వెంచర్ అని తెలుస్తోంది.
మరోవైపు అడివి శేష్ తో చేసిన ‘హిట్-2’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో వస్తున్న సినిమా కావడం.. అడివి శేష్ నటించిన చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవలే శేష్ ‘మేజర్’ సినిమాతో శేష్ భారీ విజయాన్ని అందుకోవడం ‘హిట్-2’ చిత్రానికి బాగా కలిసొస్తోంది.
మేజర్' సినిమా పాన్ ఇండియా లెవల్ లో విజయం సాధించడంతో.. అడివి శేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దీంతో సహజంగానే అతని తదుపరి మూవీ పై అందరిలో ఆసక్తి ఉంటుంది. అంతేకాదు శేష్ కెరీర్లోనే అతి పెద్ద సక్సెస్ అందుకోవడంతో ఒక్కసారిగా అతడి మార్కెట్ బాగా పెరిగిపోయింది.
ఇదంతా ‘హిట్-2’ సినిమాకు బజ్ తెచ్చిపెట్టడమే కాదు.. బిజినెస్ పెద్ద స్థాయిలో జరగడానికి.. మంచి ఓపెనింగ్స్ రాబట్టడానికి సహాయ పడుతుంది. ఇది నిర్మాతగా నాని కి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. దీనిని బట్టి ప్రొడ్యూసర్ గా నాని కి అంతా బాగానే కలిసొస్తోందని అనుకోవాలి.
అయితే హీరోగా నాని కెరీర్ గత కొంతకాలంగా కాస్త ఇబ్బందికరంగా ఉందనిపిస్తోంది. పాండమిక్ టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలలో విడుదల చేసిన ‘వి’ ‘టక్ జగదీష్’ చిత్రాలు నిరాశ పరిచాయి. ఈ క్రమంలో వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా మిగిలింది.
‘అంటే సుందరానికీ’ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టకోగా.. బాక్సాఫీస్ వద్ద మరోసారి ఎదురు దెబ్బ తగిలేలా చేసింది. హిట్ టాక్ తెచ్చుకుని కూడా ఈ సినిమా కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఇలా ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు నాని క్రెడిబిలిటీని దెబ్బ తీస్తే.. థియేటర్లలోకి వచ్చిన సినిమాలు రెండు మార్కెట్ ను కొంత మేర దెబ్బ తీశాయి.
ఇలా హీరోగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న నాని కి నిర్మాతగా మాత్రం అన్నీ బాగానే కలిసొస్తున్నాయని అర్థం అవుతోంది. రాబోయే 'దసరా' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని హీరోగానూ మళ్లీ ట్రాక్ లోకి వస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోన్న ఈ చిత్రం.. నాని కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.