Begin typing your search above and press return to search.

దసరా నాని.. స్టైలిష్ లుక్!

By:  Tupaki Desk   |   12 July 2022 9:55 AM GMT
దసరా నాని.. స్టైలిష్ లుక్!
X
నేచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక విభిన్నమైన కథను హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రతి కథలో కూడా తన క్యారెక్టర్ కొంత భిన్నంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక నిర్మాతలు అతనితో సినిమా చేస్తే మాత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ టార్గెట్ అందుకుంటుంది అంటుంటారు.

అయితే ఇదంతా కూడా కొన్నేళ్ల ముందు వరకు. గత మూడేళ్ల కాలంలో నాని సినిమాలు రిజల్ట్ చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద కొంత నష్టాలు కలుగజేస్తున్నాయనే చెప్పాలి.

ఆ మధ్య V టక్ జగదీష్ సినిమాలు రెండు కూడా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే. అవి థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే దారుణంగా డిజాస్టర్ అయ్యేవి అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ బాగానే రాబట్టింది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి లాభాలను అందించలేకపోయింది.

ఇక రీసెంట్ గా వచ్చిన అంటే సుందరానికి సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమా పాజిటివ్ అందుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.

నెక్స్ట్ సినిమా దసరా గురించి మాట్లాడుకునే ముందు ఇటీవల ప్రత్యేకంగా నాని ఒక ఫోటో కూడా విడుదల చేశాడు. దసరా సినిమాలో ఊర మాస్ లుక్కుతో డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతున్న నాని ఆ డోస్ ఎక్కువైంది అనుకున్నాడో ఏమో కానీ రీసెంట్గా ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహించి అందులో చాలా స్టైలిష్ గా కనిపించాడు.

తడిసిన తెల్లని చొక్కాలో రింగుల జుట్టుతో లేలేత గడ్డంతో నాని కనిపించిన విధానం ఓవర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒకవైపు దసరా సినిమాలో రఫ్ లుక్ లో కనిపించిన నేచురల్ స్టార్ ఇప్పుడు అదే లుక్ లో చాలా స్టైలిష్ గా దర్శనం ఇచ్చాడు. ఇక దసరా సినిమాపై దాదాపు 40 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి నాని ఆ రూట్లో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.