Begin typing your search above and press return to search.
నేచురల్ స్టార్ నానికి వైరస్ గండం
By: Tupaki Desk | 9 Dec 2021 2:30 AM GMTనేచురల్ స్టార్ నానికి వైరస్ గండం పట్టుకుందా? అంటే టాలీవుడ్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో కలిసి చేసిన `జెర్సీ` నానికి మంచి పేరుతో పాటు ప్రశంసల్ని కూడా అందించింది. జాతీయ స్థాయిలో ఈ చిత్రానికి ఉత్తయ తెలుగు చిత్రంగానూ, ఉత్తయ ఎడిటింగ్ ఇలా మొత్తం మూడు అవార్డులు దక్కాయి. అంతా బాగానే వుంది కానీ ఈ సినిమా తరువాత నుంచి నేచురల్ స్టార్ కెరీర్ ఏమీ బాగా లేదు.
`మనం` డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ తో చేసిన `నాని గ్యాంగ్ లీడర్` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నిజం చెప్పాలంటే భారీ అంచనాలు పెట్టుకున్న నానికి ఈ మూవీ నిరాశనే మిగిల్చింది అని చెప్పక తప్పదు. ఇక ఆ తరువాత అయినా బాగుందా అంటూ నానిని వైరస్ నీడలా వెంటాడటం మొదలు పెట్టింది. కోవిడ్ యావత్ ప్రపంచాన్ని ఓ ఆట ఆడిస్తున్న విషయం తెలిసిందే. తొలి దశ సమయంలో నాని రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ `వి`తో థియేటర్లలో సందడి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.
కానీ కుదరలేదు. వైరస్ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో `వి` చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో తనకు బాగా కలిసి వచ్చిన దర్శకుడు శివ నిర్వాణ తో కలిసి చేసిన `టక్ జగదీష్`దీ అదే పరిస్థితి. ఈ సినిమా రిలీజ్ సమయంలో సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తూ భీతావాహ వాతావరణాన్ని తలపించింది. దీంతో చేసేది లేక మళ్లీ అమెజాన్ ప్రైమ్‌నే నాని నమ్ముకోవాల్సి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ సమయంలో నాని డిస్ట్రిబ్యూటర్‌లు... ఎగ్జిబిటర్ల నుంచి ఊహించని తిరుగుబాటుని, విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ అవాంతరాలన్నింటినీ దాటి తన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`ని ఈ నెల 24న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు `ఒమిక్రాన్` అనే కొత్త వైరస్ అడ్డుతగిలే ప్రమాదం వుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లు ఓపెన్‌గానే వున్నా రానున్న రోజుల్లో మారే పరిస్థితులని బట్టి మళ్లీ ఏం జరుగుతుందోనని ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో నాని సినిమాల రిలీజ్ లకు వైరస్ అడ్డు తగులుతోందని.. నానిని ఒక విధంగా వైరస్ వెంటాడుతోందని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారు. మరి ఈ వైరస్ గండం నుంచి నాని తన `శ్యామ్ సింగ రాయ్`ని బయటపడేయాలని అంతా కోరుకుంటున్నారు.
అంతే కాదండోయ్ ఇది వరకు నాని చేసిన చిత్రాలకు `శ్యామ్ సింగ్ రాయ్`కి చాలా తేడా వుంది. బడ్జెట్ పరంగా.. ఏరియా లిమిటేషన్స్ పరంగా చాలా వ్యత్యాసం వుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై నాని భారీ అంచనాలు పెట్టుకున్నారట. అందుకు తగ్గట్టుగానే రిలీజ్ ని కూడా భారీగానే ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఈ సారైనా నాని తన సినిమాని వైరస్ గండం నుంచి తప్పించి థియేటర్లలోకి తీసుకురావాలని, తను కోరుకున్నట్టుగానే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కావాలని అంతా కోరుకుంటున్నారు.