Begin typing your search above and press return to search.

ఖాకీ చొక్కా తో న్యాచురల్ స్టార్

By:  Tupaki Desk   |   13 Dec 2018 7:18 AM GMT
ఖాకీ చొక్కా తో న్యాచురల్ స్టార్
X
ప్రస్తుతం క్రికెటర్ గా నటిస్తూ జెర్సీ షూటింగ్ లో యమా బిజీగా ఉన్న న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీస్ ని ఒక్కొక్కటిగా లైన్ లో పెడుతున్నాడు. ఇది కాగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమా ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టబోతున్నాడు. దీని తర్వాత తన తో అష్టా చెమ్మ-జెంటిల్ మెన్ తీసి హ్యాట్రిక్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఇంద్రగంటి మోహనకృష్ణ తో ఓ మూవీ చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫ్రెష్ అప్ డేట్ ప్రకారం ఇందులో నాని క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ గా నటించవచ్చని టాక్. అయితే నాని తో సమానమైన వెయిట్ ఉన్న మరో హీరో లాంటి విలన్ పాత్ర కూడా ఉందట.

దాని కోసం ఇంద్రగంటి దుల్కర్ సల్మాన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే దుల్కర్ ఇతరత్రా కారణాల వల్ల ఒప్పుకోవడానికి ఆలస్యం చేస్తున్నట్టు వినికిడి. అయితే ఈ లైన్ ను జాగ్రత్త గా గమనిస్తే తమిళ్ బ్లాక్ బస్టర్ విక్రమ్ వేదా రీమేక్ అనే అనుమానం రాకమానదు. అక్కడ బాహుబలి కి ధీటుగా రికార్డ్స్ కొల్లగొట్టిన విక్రమ్ వేదా తెలుగు లో ఇప్పటిదాకా రీమేక్ కాదు కదా కనీసం డబ్ చేసే ప్రయత్నాలు కూడా జరగలేదు.

వెంకటేష్-రానా తో ఓ దశలో తీయొచ్చు అనే టాక్ వచ్చింది కానీ ఫైనల్ గా ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇంద్రగంటి స్టోరీ లైన్ దీంతో పోలి ఉంటుందా లేక అలా అనిపిస్తున్న వేరే యాక్షన్ థ్రిల్లర్ ని రాసుకున్నాడా తెలియాల్సి ఉంది. రొటీన్ గా వెళ్తే ఎంత డేంజరో ఈ ఏడాది కృష్ణార్జునయుద్ధం-దేవదాస్ లతో నేర్చుకున్న నాని వరస మార్చడం చూస్తే న్యాచురల్ సబ్జెక్ట్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది