Begin typing your search above and press return to search.
10 ఇయర్స్ ఇండస్ట్రీ.. మళ్లీ నాని ఓకే చెప్పాడు!
By: Tupaki Desk | 11 Aug 2022 6:04 AM GMTహను రాఘవపూడి.. సున్నితమైన భావోద్వేగాలని అంతే అందంగా తెరపై ఆవిష్కరించడంతో దిట్ట అని తొలి చిత్రం `అందాల రాక్షసి`తో నిరూపించుకున్నాడు. తను కెరీర్ ప్రారంభించి ఆగస్టు తో పదేళ్లు అవుతోంది. నవీన్ చంద్ర, లావన్య త్రిపాఠి, రాహుల్ రవీంద్రన్ ఈ మూవీతో హీరో, హీరోయిన్ లుగా పరిచయం అయ్యారు. ఈ మూవీ విడుదలై అప్పుడే పదేళ్లు పూర్తి కావడం విశేషం. 2012 ఆగస్టు 10న ఈ మూవీ విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
దర్శకుడిగా హను రాఘవపూడికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దర్శకుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్న హను రాఘవపూడి ఈ పదేళ్ల ప్రయాణంలో చేసిన సినిమాలు కేవలం ఐదంటే ఐదే కావడం విశేషం. తొలి చిత్రంతో సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుని ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ మూవీ తరువాత చేసి `కృష్ణగాడి వీర ప్రేమగాథ` కూడా మంచి విజయాన్ని సాధించిన సెన్సిబుల్ లవ్ స్టోరీగా పేరు తెచ్చిపెట్టింది.
మధ్యలో నితిన్ హీరోగా చేసిన`లై`, శర్వానంద్ తో చేసిన `పడి పడి లేచే మనసు` ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. దర్శకుడిగా తడబడటం వల్లే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాపులుగా నిలిచి హనుకు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. అయితే తాజాగా ఈ నెల 5న విడుదలైన `సీతారామం` అనూహ్య విజయాన్ని అందించిన దర్శకుడిగా హను కు పూర్వ వైభవాన్ని, విమర్శకుల ప్రశంసల్ని అందించింది.
`సీతారామం` వంటి అందమైన ప్రేమకథని అంతే అందంగా తెరపై ఆవిష్కరించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటూ హను రాఘవపూడిపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. క్లాసిక్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, విమర్శకులు ముక్తకంఠంతో కీర్తిస్తున్నారు. ఇదిలా వుంటే హను రాఘవపూడి పదేళ్ల కెరీర్ ని పూర్తి చేసుకుని `సతారామం`తో క్లాసిక్ హిట్ ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయనపై ఆఫర్ల వెల్లువ మొదలైందని తెలుస్తోంది.
మొదటి నుంచి హను రాఘవపూడిది ప్రత్యేక శైలి. ఆయన సినిమాలు చాలాలా సాఫ్ట్ గా సాగుతూ వుంటాయి. ఒక వర్గం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. మధ్యలో రెండు సినిమాలతో ఇబ్బందిపడినా ఇప్పుడు `సీతారామం`తో మళ్లీ సెట్టయ్యాడు. ఇప్పటికైనా స్టార్ హీరోలు ఛాన్స్ లు ఇస్తారేమో చూడాలి.
త్వరలో బాలీవుడ్ లో ఓ యాక్షన్ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా తెలుగులో నేచురల్ స్టార్ నానితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని చెబుతున్నారు. నాని, హను ల కాంబినేషన్ లో గతంలో `కృష్ణగాడి వీర ప్రేమగాథ` తెరకెక్కింది. ఈ మూవీ తరువాత మళ్లీ కలిసి పని చేయాని ఈ కాంబినేషన్ మరో సారి జతకట్టబోతున్నారట.
ఈ మూవీని ఎవరు నిర్మాస్తారన్నది త్వరలోనే బయటికి రానుంది. `కృష్ణగాడి వీర ప్రేమగాథ` తరువాత వీరిద్దరితో సుధాకర్ చెరుకూరి ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ప్రస్తుతం ఆ కమిట్ మెంట్ ప్రకారం `దసరా` చేస్తున్నారు.