Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా అంటూ నాని రిస్క్ చేయడంలేదు కదా..?
By: Tupaki Desk | 29 Jun 2022 1:30 PM GMTనేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జోనర్స్ లో సినిమాలు చేస్తూ.. తన సహజమైన నటనతో మెప్పిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిర్మాతల హీరోగా పిలవబడిన నాని.. గత కొంతకాలంగా తన రేంజ్ కు తగ్గ సక్సెస్ అందుకోలేకపోతున్నారు.
2017 లో 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అమ్మాయి) చిత్రంతో భారీ విజయాన్ని సాధించిన నాని.. ఆ వెంటనే 'కృష్ణార్జున యుద్ధం' చిత్రంతో ప్లాప్ అందుకున్నాడు. ఈ క్రమంలో వచ్చిన 'దేవదాస్' మూవీ ఆశించిన సక్సెస్ రాబట్టలేకపోయింది. 'జెర్సీ' సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుందే కానీ.. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ గా నిలవలేకపోయింది.
అంచనాలు పెట్టుకున్న నాని 'గ్యాంగ్ లీడర్' సినిమా నిరాశ పరిచింది. ఇక పాండమిక్ టైంలో ఓటీటీలో విడుదలైన 'వి' మరియు 'టక్ జగదీశ్' చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. రెండు సినిమాలను బ్యాక్ టూ బ్యాక్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు వెళ్ళడంతో నాని థియేటర్ మార్కెట్ పై ఎఫెక్ట్ పడుతుందనే కామెంట్స్ వచ్చాయి.
దీనికి తగ్గట్టుగానే గతేడాది చివర్లో థియేట్రికల్ రిలీజ్ కాబడిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన 'అంటే సుందరానికీ' మూవీ పరిస్థితి కూడా అలానే ఉంది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన 'అంటే.. సుందరానికి' సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకున్నప్పటికీ.. వసూళ్ళను రాబట్టలేకపోయింది. దీంతో ఇప్పుడు నాని నాన్-థియేట్రికల్ రైట్స్ కూడా భారీ స్థాయిలో పడిపోయాయనే చర్చ జరుగుతోంది.
నాని ప్రస్తుతం 'దసరా' అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియాని టార్గెట్ చేయాలని నాని ప్లాన్ చేసుకున్నారు.
'దసరా' మూవీని తెలుగుతో పాటుగా హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇది నాని కి ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. దీని కోసం చాలా కష్టపడుతున్నారు. తొలిసారిగా రా అండ్ రస్టిక్ లుక్ లోకి మారిపోయాడు.
అయితే ప్రస్తుతం నాని కి హిందీలో మంచి మార్కెట్ లేదు. ఇలాంటి సమయంలో పాన్ ఇండియాని టార్గెట్ చేయడం పొరపాటు ఆవుతుందేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా 'దసరా'. ఫలితం కొంచెం అటు ఇటు కానీ అయితే మాత్రం నిర్మాతలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మరి నేచురల్ స్టార్ పాన్ ఇండియాని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో చూడాలి.