Begin typing your search above and press return to search.

దసరా లీక్స్.. గట్టిగా ఇస్తాం ఆగండంటున్న మేకర్స్..!

By:  Tupaki Desk   |   9 Jan 2023 7:30 AM GMT
దసరా లీక్స్.. గట్టిగా ఇస్తాం ఆగండంటున్న మేకర్స్..!
X
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ దసరా. ఈ సినిమాను ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నాని కెరీర్ లో ఇంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. సినిమాలో నాని రఫ్ లుక్ తో అదరగొట్టనున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో దసరా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దసరా సినిమాపై ఏర్పడ్డ ఈ బజ్ తో సినిమా నుంచి కొన్ని లీక్స్ ప్రారంభమయ్యాయి.

సినిమా షూటింగ్ స్పాట్ నుంచే ఈ లీక్స్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై అలర్ట్ అయిన చిత్ర యూనిట్ దసరా నుంచి లీక్డ్ వీడియో బయటకు వచ్చింది. ఫ్యాన్స్ అంతా కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు కావాల్సిన అప్డేట్ గట్టిగా ఇస్తాం అన్నారు. దసరా టీం సినిమాలో నాని మాట్లాడే యాసతో ఈ కామెంట్ పెట్టడం ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

ఇక కెరీర్ లో కొత్తగా ప్రయత్నించడంలో ఎప్పుడూ ముందుండే నాని ఫస్ట్ టైం ఊర మాస్ పాత్రలో కనిపిస్తున్నారు. దసరా సినిమా నాని కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా గా నిలుస్తుందని చెబుతున్నారు.

మార్చి 30న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమాపై ఇప్పటికే సూపర్ క్రేజ్ రాగా సినిమాపై మరింత బజ్ తెచ్చేందుకు మేకర్స్ దృష్టి పెడుతున్నారు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

నాని కీర్తి సురేష్ ఈ ఇద్దరు ఆల్రెడీ నేను లోకల్ సినిమా లో జత కట్టారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఇద్దరు కలిసి దసరా కోసం కలిసి నటించారు. సినిమాలో కీర్తి సురేష్ కూడా పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుందని తెలుస్తుంది. తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ సబ్జెక్ట్ తో వస్తున్న దసరా సినిమా నాని కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.

పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై క్రేజ్ పెంచేందుకు నాని రీసెంట్ గా ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేశాడు. ఈ మీట్ లో నాని దసరాలోని తన గెటప్ తో ఫ్యాన్స్ తో ఫోటోలు దిగాడు. దసరా కోసం నాని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడని చెప్పొచ్చు. మరి సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది మార్చి 30న తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.