Begin typing your search above and press return to search.
బాలకృష్ణ ఆవిష్కరించిన 'నాట్యం' మొదటి పాట 'నమః శివాయ'
By: Tupaki Desk | 6 Aug 2021 5:55 AM GMTప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్య రాజు ప్రధాన పాత్రలో నృత్యం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ''నాట్యం''. సంధ్య రాజు నటిగానే కాకుండా కొరియోగ్రాఫర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఈ సినిమాతో అరంగేట్రం చేస్తున్నారు. రేవంత్ కొరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా సినిమాటోగ్రఫీ - ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. నిష్రింకాల ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన 'నాట్యం' ఫస్ట్ లుక్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో చిత్రంలోని 'నమః శివాయ' అనే మొదటి గీతాన్ని నటసింహం నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ''నిశ్రింకల ఫిల్మ్స్ నిర్మాత సంధ్య రాజు - దర్శకుడు రేవంత్ కోరుకొండ మరియు నా సోదరుడు కమల్ కామరాజు కు నా శుభాకాంక్షలు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలోని పురాతన లేపాక్షి ఆలయ ప్రాంగణంలో ‘నమః శివాయ’ పాటను చిత్రీకరించినందుకు సంతోషంగా ఉంది. భారతదేశం కళల భూమి. విభిన్న కళా రూపాలకు చెందిన అనేక మంది ఏస్ కళాకారులు భారతదేశాన్ని గొప్ప దేశంగా మార్చారు. రేవంత్ సినిమా రచన మరియు దర్శకత్వంతో పాటు, కెమెరా మరియు ఎడిటింగ్ విభాగాలను కూడా నిర్వహించారు. ఆ బాధ్యతలను అతను చాలా చురుకుగా నిర్వహించినట్లు కనిపిస్తోంది. సినిమా ఎంత అందంగా ఉండబోతుందో ఈ ఒక్క పాట ద్వారా తెలుస్తుంది. అన్ని పాజిటివ్ వైబ్ లతో ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. యాదృచ్ఛికంగా, నేను నా 'అఖండ' చిత్రంలో అఘోరాగా నటిస్తున్నాను. 'నాట్యం' చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు మరియు దీవెనలు'' అని అన్నారు.
సంధ్య రాజు ఈఇప్పటికే ఈ జెనరేషన్ లో అందమైన టాలెంటెడ్ క్లాసికల్ డ్యాన్సర్ లలో ఒకరిగా నిరూపించుకున్నారు. ఇప్పుడు 'నమః శివాయా' పాటతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి హృదయాలను గెలుచుకుంటోంది. ఇందులో కమల్ కామరాజ్ క్లాసికల్ డాన్సర్ గా తనను తాను మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. సంధ్యరాజుతో కలిసి ఏడాది పాటు కూచిపూడి నాట్యం నేర్చుకున్నాడని తెలుస్తోంది. లేపాక్షి దేవాలయంలో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఎండలో వందలాది మందితో ఈ పాటను 6 రోజుల్లో షూట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు.
'నమః శివాయ' పాటకు శ్రావణ్ బరద్వాజ్ అద్భుతమైన బాణీలు సమకూర్చారు. సింగర్స్ కాల భైరవ - లలిత కావ్య కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. దీని కోసం జగద్గురు ఆది శంకరాచార్య యొక్క 'అర్ధనారీశ్వర స్తోత్రం' లోని పురాతన శక్తివంతమైన సాహిత్యాన్ని తీసుకున్నారు. దీనికి మహేష్ ఉప్పుటూరి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ''నాట్యం'' చిత్రాన్ని దక్షిణ భారతదేశంలోని హంపి, లేపాక్షి, బెంగుళూరు మరియు హైదరాబాద్ యొక్క అందమైన వాస్తుశిల్పి దేవాలయాలలో చిత్రీకరించారు. సంధ్యరాజుకు ఇది తొలి సినిమా అయినప్పటికీ క్లాసికల్ డ్యాన్స్ లతో పాటు మంచి నటన కూడా కనబరిచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రోహిత్ బెహల్ - ఆదిత్య మీనన్ - శుభలేఖ సుధాకర్ - భానుప్రియ - రుక్మిణి విజయ్ కుమార్ - బేబీ దీవానా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. డ్యాన్స్ ద్వారా ఒక కథను అందంగా చెప్పడమే 'నాట్యం' అంటూ వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.