Begin typing your search above and press return to search.
దర్శకుడు ఆ నటుడి తొడపై చెయ్యి వేసి...
By: Tupaki Desk | 14 July 2018 5:50 AM GMTసినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి గత కొన్ని నెలలుగా ఎంత చర్చ నడుస్తోందో తెలిసిందే. హాలీవుడ్ మొదలుకుని.. టాలీవుడ్ వరకు అన్ని చోట్లా ఈ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్లో దీని గురించి పెద్ద రచ్చే నడిచింది. కొన్ని నెలలుగా ఏ నటుడు.. నటి మీడియాను కలిసినా కాస్టింగ్ కౌచ్ గురించి మీ అభిప్రాయమేంటి అని అడుగుతున్నారు మీడియా వాళ్లు. ఐతే దాదాపుగా అందరూ ఒకే రకమైన సమాధానాలిస్తున్నారు. ఐతే భోజ్ పురి నటుడు రవికిషన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. సినీ పరిశ్రమలో మహిళలకు మాత్రమే కాక పురుషులకూ లైంగిక వేధింపులు ఉంటాయని.. ఇలాంటి అనుభవాలు బోలెడున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పురుషులకూ ఇలాంటి హరాష్మెంటా అని అందరూ ఆశ్చర్యపోయారు.
కానీ ఇలాంటివి మామూలే అని రుజువు చేసే ఉదంతం ఒకటి బయటికి వచ్చింది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నవజీత్ నారాయణ్ అనే నటుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందట. అతను ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా దర్శకుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాడట. తన కోరిక తీరిస్తే అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆ దర్శకుడు అతడికి ఆఫర్ ఇచ్చాడట. అంతటితో ఆగకుండా అతడి తొడపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడట. చెయ్యి తీయమన్నా తీయకపోవడంతో నవజీత్ ఆ దర్శకుడి చెంప చెల్లుమనిపించాడట. ఆ దర్శకుడికి వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఐతే రవికిషన్ చెప్పిన వ్యవహారం వేరు.. ఇది వేరు. పురుషులకు మహిళల నుంచి వేధింపులు ఎదురవుతాయని రవికిషన్ అంటే.. పురుషులకు పురుషుల నుంచే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో నవజీత్ ఉదంతం ఉదాహరణ.