Begin typing your search above and press return to search.

డ్రగ్స్‌ కేసు : 'నాకు ఏం బాధ లేదు బ్రదర్‌.. నువ్వు బాధ పడకు'

By:  Tupaki Desk   |   12 Sep 2020 4:00 PM GMT
డ్రగ్స్‌ కేసు : నాకు ఏం బాధ లేదు బ్రదర్‌.. నువ్వు బాధ పడకు
X
బాలీవుడ్‌ లో మొదలైన డ్రగ్స్ మాఫియా ప్రకంపనలు శాండిల్‌ వుడ్‌ మీదుగా ఇప్పుడు టాలీవుడ్‌ కు పాకాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి మరియు శాండిల్ వుడ్ బ్యూటీస్ రాగిణి ద్వివేది - సంజన గల్రాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ బాంబ్ పేలిందని.. త్వరలోనే పెద్ద చేపలు బయటకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారుల విచారణలో రియా చక్రవర్తి 25 మంది సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించునట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రియా బయటపెట్టిన లిస్ట్ లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీఖాన్ పేర్లు కుడా ఉన్నాయని నేషనల్ మీడియా చెప్తుండటంతో బాలీవుడ్‌ తో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ టెన్షన్ మొదలైంది. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా చర్చనీయాంశంగా మారింది. రియా ఇంకా ఎవరి పేర్లు చెప్పిందో అని ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ చేసుకున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఉందని వార్తలు వస్తుండటంతో టాలీవుడ్‌ లో కూడా మరోసారి డ్రగ్ వ్యవహారం బయటకు వస్తాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల రియా కాల్ లిస్ట్ ద్వారా రకుల్ - దగ్గుబాటి రానా లతో ఆమె మాట్లాడినట్లు తెలిసింది. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియనప్పటికీ టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ వ్యవహారం బయటకు వస్తుందంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ''రకుల్ - మంచు - రానా - నవదీప్.. మళ్ళీ టాలీవుడ్ లో ఇది యూ టర్న్ తీసుకుంటుంది. నవదీప్ అన్నా మనకి ఈ బాధలు తప్పేలా లేవు. కొంచం జాగ్రత్త'' అని నవదీప్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి నవదీప్ స్పందిస్తూ ''నాకు ఏం బాధ లేదు బ్రదర్‌. నువ్వు కూడా ఏ బాధ పడకు.. పదా పనొచ్చే పనులు చేసుకుందాం'' అని కామెంట్ పెట్టాడు.

కాగా 2017లో టాలీవుడ్‌ డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో లింకులు ఉన్నాయంటూ 15 మంది టాలీవుడ్‌ ప్రముఖులకు అప్పట్లో తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిట్ అధికారులు విచారించారు. పూరీ జగన్నాథ్ - రవితేజ - ఛార్మి - తరుణ్ - నవదీప్ - ముమైత్ ఖాన్ - సుబ్బరాజు సహా పలువురి పేర్లు వినిపించాయి. వీరిని సిట్ అధికారులు విచారించడంతో పాటు డ్రగ్ టెస్ట్ కోసం శాంపిల్స్‌ కూడా సేకరించారని వార్తలు వచ్చాయి. అయితే టాలీవుడ్ డ్రగ్ కేసులో విచారించిన వారిలో ఎవరిని అరెస్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా బయటపడుతుండటంతో టాలీవుడ్ లో కూడా డ్రగ్ మూలాలు బయటపడుతాయని కామెంట్స్ చేస్తున్నారు.