Begin typing your search above and press return to search.
చేతి గాయం సరే.. కెరీర్ గాయం?
By: Tupaki Desk | 11 Jun 2015 7:15 AM GMT'టాలీవుడ్స్ స్మార్టెస్ట్ హీరోస్' అన్న కాంటెస్ట్ పెడితే.. ఆ పోటీలో మహేష్ తర్వాత నవదీప్కే ఓటేయాలి. అంత గ్లామర్, ఛరిష్మా ఉన్న హీరో వేరెవరూ లేనేలేరు. అందం ఉంది. ప్రతిభ ఉంది. కానీ ఏం లాభం? స్టామినాకి తగ్గట్టు ఎదగలేకపోయాడు. కెరీర్ విషయంలో కొన్ని తప్పులు చేశా. వాటిని సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా అని అప్పట్లో చెప్పాడు.
కానీ సరిచేసుకునేంత అవకాశం రానేలేదు ఇంతవరకూ. ఇటీవలి కాలంలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లో ఏవైనా అవకాశాలు వస్తే అవన్నీ నవదీప్ స్థాయికి తగ్గ పాత్రలు కానేకావు. ఏదో విలన్‌గా ఐదు నిమిషాలు కనిపించి వెళ్లేవే. అప్పట్లో బాద్షాలో చేసిన పాత్ర అలాంటిదే. ఆ తర్వాత సోలో హీరోగా చేసిన సినిమాలొచ్చినా వచ్చాయో లేదో కూడా ఎవరికీ తెలీదు. ఇటీవలే లక్ష్మీ మంచు దొంగాటలో నేనూ ఉన్నా అనిపించే కామియో పాత్రలో చేశాడు. ప్రస్తుతం తమిళ సినిమా ఇదు ఎన్న మాయం(విక్రమ్ ప్రభు హీరో)లో సహాయకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అనువాదం కూడా తెలుగులో రిలీజవుతుంది.
ఇదంతా సరే.. ఇటీవలే నవదీప్ చేతికి (రిస్ట్కి) గాయమైంది. జిమ్ముకెళ్లి కనీసం 2.5కె.జి డంబెల్ అయినా ఎత్తలేని పరిస్థితి. కొద్దిరోజులుగా నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఇప్పటికి గాయం నయమైంది. యథావిధి పరిస్థితికొచ్చాడు. చేతికి అయిన గాయం సరే.. కెరీర్‌కి అయిన గాయం మానేదెప్పుడు నవదీప్? అని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.