Begin typing your search above and press return to search.
పొల్లు పోకుండా రాశారు.. థ్యాంక్స్!!
By: Tupaki Desk | 16 July 2017 6:33 AM GMTహైదరాబాద్ లో కొంతమంది డ్రగ్స్ మాఫియా నడిపే వాళ్ళ దగ్గర తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రికి చెందిన వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉండటంతో వాళ్ళని పై విచారణ చేయడం మొదలుపెట్టారు. ఆ లిస్ట్ లో డైరెక్టర్లు - యంగ్ హీరోలు - హీరోయిన్లు ఉండటం అందరిని ఆశ్చర్యపరిచిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పక్కా ఆధారాలతోనే వాళ్ళకి నోటిస్లు ఇచ్చామని చెప్పారు. ఆ స్టార్స్ మేము పిలిచినప్పుడు విచారణకు రావలిసిఉంటుంది అని కూడా స్పష్టం చేశారు. ఈ డ్రగ్స్ భాగోతంలో హీరో నవదీప్ కు కూడా నోటిస్ ఇచ్చారు.
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధారాలు చూపిస్తున్నా కూడా కొంతమంది నటులు మాకు డ్రగ్స్ తో ఎటువంటి సంబంధం లేదని కరాకండిగా చెబుతున్నారు. ఒక ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో దీనిగురించే చెప్పిన నవదీప్.. ఆ పత్రికకు థ్యాంక్స్ అంటున్నాడు. ఎందుకంటే అతను ఏమి చెప్పితే అదే పొల్లు పోకుండా రాసినందుకట. ఇంతకు నవదీప్ ఏమన్నాడు అంటే “ నాకు తెలిసిన ఒక ఈవెంట్ మేనేజర్ దగ్గర నా నెంబర్ ఉండి ఉంటుంది. అతను ఈ డ్రగ్స్ కేసులో నిందితుడు. అందువలన నా పేరు కూడా వచ్చింది ఇందులోకి. నేను ఒక భాద్యత గల పౌరుడుగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళ విచారణకు తోర్పడతాను. ఇదేం మొదటిసారి కాదు పేరున్న పబ్లు పై గురి పెట్టడం. అంతా ఒట్టి భూటాకం. కొంతమంది స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు అని తెలినప్పుడు చాలా బాధ అనిపించింది. మీకు మేము డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించేటట్లు కనిపిస్తున్నామా? అని చెప్పాడు. నవదీప్ కు సిటీలో ఒక పబ్ ఉందిలేండి. అక్కడే డ్రగ్స్ అమ్ముతున్నారనేది ఒక అభియోగమట.
చూద్దాం ఫైనల్ గా నవదీప్ విషయంలో ఎక్సయిజ్ శాఖ ఏమంటుందో!!