Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్..చరణ్ డైలాగ్స్ పై వివరణ ఇచ్చిన హీరో
By: Tupaki Desk | 13 Feb 2019 3:10 PM GMTనవీన్ చంద్ర.. గాయత్రి సురేష్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా 'హీరో హీరోయిన్'. పైరసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఈరోజే రిలీజ్ అయింది. ఈ టీజర్లో ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు సంబంధించిన ఒక సీన్ ఉంది. ఈ సన్నివేశం కాస్త వివాదాస్పదమయ్యేలానే ఉంది. ఎందుకంటే తమ ఫేవరేట్ హీరో సినిమాను పైరసీ చేసినందుకు మండిపడుతున్న ఎన్టీఆర్ అభిమానులు నవీన్ చంద్రను నిలదీస్ఫై చేస్తారు.. సారీ.. నిలదీస్తారు. అప్పుడు నవీన్ నెక్స్ట్ వీక్ చరణ్ సినిమాను ఇంతకంటే ఎక్కువగా పైరసీ చేస్తానని అనడంతో వారు సంతోషపడతారు.
ఈ సీన్ పై నవీన్ చంద్ర మాట్లాడుతూ అలాంటి ఫ్యాన్స్ కొందరు ఉన్నారని యూట్యూబ్ లో ఒక హీరో సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందంటే మరో హీరో ఫ్యాన్స్ తిట్టడం.. నెగెటివ్ గా మాట్లాడడం లాంటివి చేస్తున్నారు. హీరోలు బాగుంటారు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇలా ఎందుకు ఇలా ఉన్నారు... ఫ్యాన్స్ ఎలా ఉంటే బాగుంటుందనే విషయం తమ సినిమాలో చర్చించామని తెలిపాడు. ఈ సినిమా మొదలు పెట్టిన సమయంలో చరణ్.. ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తారని తెలియదని.. అప్పటికి #RRR ప్రకటన రాలేదని అన్నాడు.
మన తెలుగు ఇండస్ట్రీలో హీరోలకు ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్ గా ఉంటుందని ఇది నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమని.. ఫ్యాన్స్ నిజంగా తలుచుకుంటే పైరసీ ని ఆరికట్టడం వీలవుతుందని అన్నాడు. దీనికి ఉదాహరణగా 'టాక్సీవాలా' సినిమా గురించి చెప్పాడు. 'టాక్సీవాలా' రిలీజ్ కు ముందే పైరసీ ప్రింట్ బయటకు వచ్చినా ఫ్యాన్స్ థియేటర్లకు వెళ్లి చూసి మరీ హిట్ చేశారు. ఫ్యాన్స్ లో చాలామంది టెక్నాలజీ తెలిసిన వారు కూడా ఉంటారని.. పైరసీ సినిమా ఉందని తెలిస్తే దాన్ని ఆపడం వారికి కొంతవరకూ సాధ్యమవుతుందని అన్నాడు. ఫ్యాన్స్ కనుక గట్టిగా తలుచుకుంటే.. పైరసీ మీద రియాక్ట్ అయితే దాన్ని సగానికి పైగా తగ్గించొచ్చు అనే ఉద్దేశంతో దర్శకుడు రాసుకున్న కథ ఇదని చెప్పాడు.