Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ లేకుంటే ఏమయ్యేవాడినో...!
By: Tupaki Desk | 16 April 2019 6:51 AM GMTఅందాల రాక్షసి చిత్రంలో విభిన్నమైన పాత్రను పోషించి నటుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నవీన్ చంద్ర ఆ తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. అయితే నవీన్ చంద్రకు హీరోగా బ్రేక్ రాలేదు. ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా - విలన్ గా కూడా ప్రయత్నాలు చేశాడు. అయినా కూడా అతడి కెరీర్ మరో స్టేజ్ కు వెళ్లలేక పోయింది. ఆ సమయంలో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల కాంభినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' చిత్రంలో విలన్ గా నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ చిత్రంలో నవీన్ చంద్ర పోషించిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో పాటు - విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దాంతో మళ్లీ నవీన్ చంద్రకు అవకాశాలు దక్కుతున్నాయి.
తాజాగా నవీన్ చంద్ర హీరోగా వేణు మధుకంటి దర్శకత్వంలో ఒక చిత్రం మొదలైంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్బంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ.. వరుసగా ఫ్లాప్ లు వచ్చిన సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ గారు నాకు బాలిరెడ్డి పాత్రను అరవింద సమేత చిత్రంలో ఇచ్చారు. ఆ పాత్రతో మళ్లీ నాకు జీవం వచ్చినట్లయ్యింది. ఆ సినిమా నా కెరీర్ మళ్లీ ప్రారంభం అయ్యేలా చేసింది. ఎన్టీఆర్ గారు ఆ సినిమాలో ఛాన్స్ ఇవ్వకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేను.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందబోతున్న ఈ చిత్రం కథపై నేను దర్శకుడు దాదాపు సంవత్సరం వర్క్ చేశాం. ఇద్దరం కలిసి చాలా రోజుల పాటు చర్చలు జరిపి చివరకు మంచి కథను సిద్దం చేశాం. తప్పకుండా ఇదో మంచి చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు. హీరోగా ఈ చిత్రంతో నవీన్ చంద్ర మళ్లీ బిజీ అవుతాడేమో చూడాలి.