Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ హంగామా చేస్తున్న జాతిరత్నం వీడియో వైరల్!

By:  Tupaki Desk   |   7 April 2021 12:58 PM GMT
ఫ్యాన్స్ హంగామా చేస్తున్న జాతిరత్నం వీడియో వైరల్!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టాలెంట్స్ రోజురోజుకి సక్సెస్ అందుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరో నవీన్ పొలిశెట్టి.. జాతిరత్నాలు సినిమాతో తనలోని యాక్టింగ్ స్టార్ ను బయటపెట్టాడు. ఇంతకాలం ఏజెంట్ గా పిలిచిన ఫ్యాన్స్ ఇప్పుడు జాతిరత్నం, జోగిపేట శ్రీకాంత్ అంటూ పిలవడం విశేషం. నవీన్ కూడా ఏజెంట్, ఆత్రేయ లాంటివి కాకుండా కొత్తగా పిలిస్తే సంతోషిస్తా అని ఇదివరకు పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. అయితే మొత్తానికి జాతిరత్నాలు సినిమాతో తన సెకండ్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు నవీన్. ఈ సినిమా విజయంతో నవీన్ ఒక్కసారిగా మంచి క్రేజ్ సంపాదించుకొని వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

జోగిపేట శ్రీకాంత్ పాత్రలో నవీన్ హవా మాములుగా లేదు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన జాతిరత్నాలు సినిమా దాదాపు నలభై కోట్లు వసూల్ చేసిందంటే మాములు విషయం కాదు. ఈ మధ్యకాలంలో బడ్జెట్ రాబట్టడమే సినిమాలకు గగనం అయిపోయింది. అలాంటిది జాతిరత్నాలు మూవీ ఏ రేంజిలో లాభాలు ముట్టజెప్పిందో అర్ధం చేసుకోవచ్చు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి నిర్మించిన ఈ కామెడీ సినిమాను యంగ్ డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో ఎవరు ఏం చేసినా నవీన్ మాత్రం హిలేరియస్ యాక్టింగ్ తో అదరగొట్టేసాడు. సోషల్ మీడియాలో నవీన్ క్రేజ్ మాములుగా లేదు. తాజాగా అభిమానులు సమక్షంలో నవీన్ కార్ పై పడుకొని సెల్ఫీలకు పోజులిస్తూ హంగామా చేసాడు. ఆ వీడియోను తన ఇంస్టా ఖాతాలో పోస్ట్ చేసాడు. వీడియో చూస్తే జాతిరత్నాలు సెలెబ్రేషన్స్ ఇంకా అయిపోయినట్లుగా లేదు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.