Begin typing your search above and press return to search.

న‌వీన్ పొలిశెట్టి రెమ్యున‌రేష‌న్ లీక్ చేసిన ప్రియ‌ద‌ర్శి!

By:  Tupaki Desk   |   26 March 2021 2:30 PM GMT
న‌వీన్ పొలిశెట్టి రెమ్యున‌రేష‌న్ లీక్ చేసిన ప్రియ‌ద‌ర్శి!
X
టాలీవుడ్ జాతిర‌త్నం న‌వీన్ పొలిశెట్టి క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. 'ఏజెంట్ ఆత్రేయ‌', 'జాతి రత్నాలు' సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టడం.. ఇందులో జాతిర‌త్నాలు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో ఇండ‌స్ట్రీ చూపంతా న‌వీన్ పైనే ప‌డింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిన ఈ మూవీ.. ఓవ‌ర్సీస్ లో కుమ్మేసింది. ఏకంగా మిలియ‌న్ డాల‌ర్లు రాబ‌ట్టి.. ఈ ఏటి మేటి చిత్రంగా నిలిచింది.

దీంతో.. బ‌డా నిర్మాత‌లంతా న‌వీన్ వెంట ప‌డుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేష‌న్స్ స్వీటీ అనుష్క - న‌వీన్ పొలిశెట్టితో ఓ సినిమా కూడా మొద‌లెట్టేసిందనే ప్ర‌చారం సాగుతోంది. మిడిల్ ఏజ్ ఉన్న యువతికి, ఓ యువడికి మధ్య సాగే మెచ్యూర్డ్‌ ప్రేమ కథను ఆవిష్కరించబోతున్నారట మేకర్స్.

మ‌రోవైపు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ మేర‌కు న‌వీన్ తో అగ్రిమెంట్ కూడా తీసుకున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడు స్టోరీ దొర‌క‌డ‌మే ఆల‌స్య‌మ‌ని టాక్‌. మంచి స్క్రిప్టు దొర‌గ్గానే.. సినిమా సెట్స్ మీద‌కు వెళ్లిపోతుంద‌ని స‌మాచారం. ఇంకోవైపు ప్రిన్స్ మ‌హేష్ కూడా సొంత ప్రొడ‌క్ష‌న్లో న‌వీన్ తో ఓ సినిమా ప్లాన్ చేసే ఛాన్స్ ఉంద‌ని భోగ‌ట్టా.

ఇలాంటి ప‌రిస్థితుల్లో న‌వీన్ పొలిశెట్టి రెమ్యున‌రేష‌న్ గురించి మాట్లాడాడు స‌హ‌చ‌ర జాతిర‌త్నం ప్రియ‌ద‌ర్శి. అమెరికా విజ‌య యాత్ర‌లో ఉన్న వీరు.. ఇటీవ‌ల ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా న‌వీన్ తీసుకుంటున్న పారితోషికం రూ.3 కోట్లు అని చెప్పాడు ప్రియ‌ద‌ర్శి. దీంతో షాక్ అయిన న‌వీన్‌.. ‘అంత త‌క్కువ చెప్పావేంటీ..? మ‌రో రెండు క‌లిపి మొత్తం ఐదు కోట్ల‌ని చెప్పు' అంటూ కవర్ చేశాడు. మొత్తానికి ఎంతో రివీల్ చేయ‌లేదుగానీ.. ఈ రెండు రెమ్యున‌రేష‌న్ మాత్రం గ‌ట్టిగ‌నే డిమాండ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.