Begin typing your search above and press return to search.
ఏజెంట్ ఆత్రేయ నుంచి ఆసిడ్ దాకా
By: Tupaki Desk | 5 Aug 2019 4:34 AM GMTఇటీవలి కాలంలో తెలుగులో చిన్న సినిమాల్లో పెద్ద సక్సెస్ సాధించిన వాటిలో చెప్పుకోదగినది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి అటు కంటెంట్ పరంగానూ ఇటు కమర్షియల్ గానూ వర్క్ అవుట్ చేసుకున్న ఈ మూవీ ద్వారా హీరో నవీన్ పోలిశెట్టికి వచ్చిన గుర్తింపు చిన్నదేమి కాదు. సోషల్ నెట్ వర్క్ లో మంచి పాపులారిటీ ఉన్న ఇతగాడు ఇప్పుడు హీరోగా ప్రూవ్ చేసుకోవడంతో ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
ఇదిలా ఉండగా తక్కువ గ్యాప్ లోనే నవీన్ కు బాలీవుడ్ లోనూ ప్రూవ్ చేసుకునే అవకాశం దొరకడం విశేషం. దంగల్ ఫేమ్ నితీష్ తివారి రూపొందించిన చిచోరే వచ్చే నెల 6న విడుదల కానుంది. ఇది ఆత్రేయ కన్నా ముందే నవీన్ ఒప్పుకున్న హిందీ మూవీ. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ - శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఆసిడ్ అనే హీరో స్నేహితుడి పాత్రను పోషించాడు. నిన్న రిలీజైన ట్రైలర్ లో ఇది హై లైట్ అయ్యింది కూడా
త్రీ ఇడియట్స్ ఎంత బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో అమీర్ ఖాన్ కు వచ్చినంత పేరు ఫ్రెండ్స్ గా నటించిన మాధవన్ బ్యాచ్ కూ వచ్చింది. అదే తరహాలో అంతకు మించిన మేకింగ్ వాల్యూస్ తో కాలేజీ క్యాంపస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చిచోరేలో సైతం అలాంటి గుర్తింపే వస్తుందని ఇన్ సైడ్ టాక్. అదే జరిగితే ఇప్పటికే టాలీవుడ్ ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నవీన్ పోలిశెట్టికి ముంబై నుంచి కూడా ఫోన్ కాల్స్ మొదలవుతాయి.
పాత్ర పేరే ఆసిడ్ అని పెట్టారు. సో యూత్ కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అందులోనూ యువకుడిగా వయసు మళ్ళిన వాడిగా రెండు షేడ్స్ లో నవీన్ రోల్ ఉంటుంది. వర్క్ అవుట్ అయితే మాత్రం రచ్చ మాములుగా ఉండదు. వాస్తవానికి చిచోరే ముందు అనుకున్న తేదీ ఆగస్ట్ 30. సాహో అదే డేట్ కు వస్తుండటంతో వారం వాయిదా వేసుకుని సెప్టెంబర్ 6కు షిఫ్ట్ అయ్యారు. తక్కువ గ్యాప్ లో ఓ అప్ కమింగ్ హీరో సినిమాలు రెండు భాషల్లో రావడం విశేషమే. అందుకే నవీన్ దీని ఫలితం మీద కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు