Begin typing your search above and press return to search.
తాప్సీ సినిమాకు సపోర్ట్ గా జాతిరత్నం
By: Tupaki Desk | 29 March 2022 6:30 AM GMTఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి చిత్రంతో తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు యువ దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'. తాప్సీ ప్రధాన పాత్రలో నటించింది. కీలక పాత్రల్లో ముగ్గురు చైల్డ్ ఆర్టిస్ట్ లు రోషన్, భాను ప్రకాష్, జై తీర్థ నటించారు. విభిన్నమైన కథ, కథనాలతో ఆద్యంతం వినోదాత్మంగా తెరకెక్కిన ఈ మూవీని మాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
ఓ సరికొత్త కథనంతో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్ లతో అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. సరికొత్త నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి 'జాతరత్నాలు' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నవీన్ పొలిశెట్టి వాయిస్ ఓవర్ అందించారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతూనే ట్విస్ట్ లు, టర్న్ లతో ఉత్కంఠతని రేకెత్తించనుందట.
ఈ కథని, కథలోని పాత్రలని పరిచయం చేస్తూ హీరో నవీన్ పొలిశెట్టి తనదైన స్టైల్లో చెప్పే నరేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.
దీనికి నవీన్ పొలిశెట్టి వాయిస్ ఓవర్ యాడ్ కావడంతో సినిమాకు ఇది మరింత ప్లస్ గా మారనుందని తెలుస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి ఈ మూవీ దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు.
'మిషన్ ఇంపాజిబుల్' కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్. 'గేమ్ ఓవర్' వంటి థ్రిల్లర్ తరువాత దాదాపు మూడున్నరేళ్ల విరామం అనంతరం తాప్సీ చేసిన తెలుగు చిత్రమిది.
దీంతో ఈ సినిమాపై అంచనాలున్నాయి. చాలా రోజుల తరువాత తాప్సీ నుంచి తెలుగులో వస్తున్న సినిమా కావడంతో ఆమెకిది రీఎంట్రీ మూవీ అవుతుందని అంతా భావిస్తున్నారు. మార్క్ కె. రాబిన్ సంగీతం, దీపక్ యెరగార సినిమాటోగ్రఫీ, రాజ గిరిజాల ఎడిటింగ్ అందించారు. రవీందర్ విజయ్, హరీష్ పెరేడి, రిషబ్ శెట్టి ఇతర కీక పాత్రల్లో నటించారు.