Begin typing your search above and press return to search.
'నవాబ్' కంటే 'దేవదాస్' కాన్ఫిడెంట్?
By: Tupaki Desk | 27 Sep 2018 5:03 AM GMTప్రతి వారం మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి వారం వేరు. ఈ వారం వేరు. నేడు రెండు క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి. కింగ్ నాగార్జున- నేచురల్ స్టార్ నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనిదత్ నిర్మించిన `దేవదాస్` - అరవిందస్వామి-శింబు తదితరులతో మణిరత్నం స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన `నవాబ్` ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఈ పోటీలో ఎవరిని విక్టరీ వరిస్తుంది? ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తో దూసుకెళతాయా? అంటూ ఒకటే ఆసక్తికర విశ్లేషణ సాగుతోంది.
అయితే ఇరు సినిమాల విషయంలో జరిగిన ప్రచారం పోల్చి చూస్తే `నవాబ్` ఏ రకంగానూ `దేవదాస్`కి పోటీ కానేకాదు. నవాబ్ చిత్రాన్ని ఒక డబ్బింగ్ సినిమాగానే సోసోగా భావించాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. మణిరత్నం అంతటి లెజెండ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఉన్నా `నవాబ్` తెలుగు ప్రచారం తూతూగానే సాగించారు. రిలీజ్ ముందు ప్రెస్ మీట్ - ఆన్ లైన్ లో పోస్టర్లు తప్ప ఈ సినిమా కోసం చేసిందేం లేదు. అదొక్కటే కాదు మణిరత్నం గత చిత్రాలన్నీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద బోర్లా పడడం కూడా ఓ కారణమని విశ్లేషిస్తున్నారు. అయితే `దేవదాస్` విషయంలో నాగార్జున - నాని - అశ్వనిదత్ బృందం తొలి నుంచి విలక్షణంగా ప్రమోట్ చేసింది. ప్రచారం పరంగా ఏ లోటూ లేకుండా చూసుకుంది.
నేడు ఈ రెండు సినిమాల ప్రివ్యూల నుంచి రిపోర్ట్ అందుతుందనుకుంటే .. కేవలం `దేవదాస్`కి మాత్రమే క్రిటిక్స్ ప్రివ్యూ వేశారు. నవాబ్ ప్రివ్యూ నేటి మధ్యాహ్నం ఉంటుందని ప్రకటించి - చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడం మీడియాలో చర్చకొచ్చింది. `నవాబ్`లో కాన్ఫిడెన్స్ మిస్సయిందా? లేక ఓవర్‌కాన్ఫిడెన్సా? అసలేమైంది? కారణమేంటి? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. మధ్యాహ్నం 12 తర్వాత `దేవదాస్` ఫస్ట్ ఇంప్రెషన్ నేరుగా క్రిటిక్స్ రివ్యూల రూపంలో అలానే ఆడియెన్ రివ్యూల రూపంలో తేలిపోనుంది. ఈ సినిమా బావుంది అన్న టాక్ వస్తే - నవాబ్ జోలికి వెళ్లకుండా ఆన్ లైన్ లో టిక్కెట్ల బుకింగ్ సాగుతుందనడంలో సందేహం లేదు