Begin typing your search above and press return to search.
నటుడికి అండగా నిలిచిన భార్య
By: Tupaki Desk | 12 March 2018 7:53 AM GMTరంగం ఏదైనా ప్రముఖులన్నాక వివాదాలు కామన్. అందునా గ్లామర్ ఫీల్డ్‌కు చెందిన వారికి ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంది. ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. కానీ ఇంట్లో వాళ్ల సపోర్ట్ లేకుంటే క్రికెటర్ షమీ లాంటి పరిస్థితే ఎదురవుతుంది. భర్త మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేయటమే కాదు.. అతడి కెరీర్ మొత్తాన్ని తన విమర్శలతో కుప్పకూల్చేసిందని చెప్పాలి. అదే సమయంలో షమీ చేసిన తప్పులేం చిన్నవేమీ కావు. ఒకవేళ అతడి భార్య ఆరోపించిన వాటిల్లో సగం తప్పులు షమీ చేసినా.. ఇప్పుడున్న పరిస్థితికి అతడు అర్హుడే.
ఆ విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖికి సంబందించిన షాకింగ్ వార్తలు బయటకు వచ్చాయి. కట్టుకున్న భార్య కాల్ డేటా కోసం డిటెక్టివ్ లను నియమించాడన్నది సారాంశం. దీనికి సంబంధించిన సంచలన వార్తల్ని ముంబయి మీడియా అచ్చేసింది. తమ కాల్స్ ను కొందరు ట్రాప్ చేస్తున్నారంటూ ముంబయికి చెందిన పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఫోన్ కాల్స్ ను ట్రాప్ చేస్తున్న 11 మందిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు ప్రైవేటు డిటెక్టివ్ లు ఉన్నారు. వారిని విచారించే క్రమంలో.. బాలీవుడ్ నటుడు సిద్ధిఖీ తమ క్లయింట్‌గా ఒక డిటెక్టివ్ చెప్పారని.. తన భార్య కాల్ డేటా కోసం తనను సిద్దిఖీ ఆశ్రయించినట్లుగా వెల్లడించాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
అవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉంటే.. సిద్దిఖీ మీద వచ్చిన వార్తలపై అతడి సతీమణి అంజలి స్వయంగా సీన్లోకి వచ్చారు. తన భర్త మీద వచ్చిన ఆరోపణలు తప్పని తేల్చారు. తన భర్త మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. తన భర్త అలాంటి వాడు కాదని తేల్చి చెప్పింది. గతంలో తామిద్దరం విడాకులు తీసుకున్నట్లుగా ఊహాగానాలు వచ్చాయని.. అయితే.. ఇవన్నీ మామూలే కదా అని ఊరుకున్నామని.. ఇప్పుడు వస్తున్న ఆరోపణలు షాకింగ్ గా మారినట్లు ఆమె చెప్పారు. అందుకే.. తాను మౌనాన్ని వీడాలని భావించి బయటకు వచ్చినట్లు చెప్పారు.
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణల్ని సిద్దిఖీ ఖండించాడు. తన భర్త గురించి అంజలి మాట్లాడుతూ.. తన భర్త ముస్లిం అని.. తాను బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చానని.. నవాజ్ తన గురించి అలా చేయించరన్నారు. సిద్దిఖీపై వచ్చిన ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుందని పేర్కంది. భర్తపై వచ్చిన ఆరోపణల్ని బలంగా ఖండించటమే కాదు.. క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత ఎవరేం అనుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది చెప్పండి.