Begin typing your search above and press return to search.

సౌత్ సినిమా స‌క్సెస్ ని కించ ప‌రిచిన న‌వాజుద్దీన్!

By:  Tupaki Desk   |   25 April 2022 2:30 AM GMT
సౌత్ సినిమా స‌క్సెస్ ని కించ ప‌రిచిన న‌వాజుద్దీన్!
X
సౌత్ సినిమా అంటే ఇప్పుడు బాలీవుడ్ గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తుంది. `బాహుబ‌లి` ప్రాంచైజీ వసూళ్ల ప‌రంగా ఇండియాలోనే తెలుగు సినిమా రెండవ స్థానంలో నిలిచింది. ఆ త‌ర్వాత క‌న్న‌డ ప్రాంచైజీ `కేజీఎఫ్` తెలుగు సినిమా `ఆర్ ఆర్ ఆర్` కి పోటీగా రేసులో నిలిచే ఛాన్స్ ఉంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప ది రైజ్` తో సైలెంట్ గా వ‌చ్చి హిందీ బెల్ట్ లో సునామీ వ‌సూళ్లు సాధించాడు. తెలుగు సినిమా ఏం చూస్తాంలే అనుకున్న హిందీ జ‌నం ఒక్క‌సారిగా `పుష్ప` థియేట‌ర్లు వైపు ప‌రుగులు తీసారు.

సౌత్ సినిమా అంటే పాన్ ఇండియా నిదాటి పాన్ వ‌ర‌ల్డ్ కి రీచ్ అవ్వ‌డానికి రెడీ అవుతుంది. రాజ‌మౌళి..ప్ర‌శాంత్ నీల్ లాంటి ట్యాలెంటెడ్ మేక‌ర్స్ ఇంకా సౌత్ లో చాలామందే ఉన్నారు. వాళ్లంతా బ‌య‌ట‌కి రాగ‌లిగితే హిందీ క‌న్నా గొప్ప సినిమాలు చేయ‌గ‌ల స‌త్తా ఉన్న‌వారున్నారు. దమ్మున్నోడు ఎప్పుడొచ్చినా దుమ్మ లేస్తుంది అన‌డానికి సౌత్ సినిమాని ఉద‌హ‌రించొచ్చు.

సౌత్ ప్ర‌తిభ‌ను..అందులోనూ టాలీవుడ్ ట్యాలెంట్ ని మెచ్చే క‌దా అమీర్ ఖాన్..సంజ‌య్ ద‌త్..క‌ర‌ణ్ జోహార్ ..స‌ల్మాన్ ఖాన్ లాంటి దిగ్గ‌జాలు తెలుగు సినిమా గురించి అంత గొప్ప‌గా మాట్లాడారు. అయితే సౌత్ సినిమాని ఇలా హిందీ దిగ్గ‌జాలు మెచ్చ‌డం గానీ...సౌత్ సినిమాలు హిందీలో విజ‌యం సాధించ‌డంగానీ కొంద‌రు బాలీవుడ్ న‌టుల‌కు..క్రిటిక్స్ ఏమాత్రం న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది.

అసూయ‌తో కుళ్లుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. సౌత్ సినిమా మీద నోరు పారేసుకుంటున్న వైఖ‌రి చూస్తుంటేనే కొంద‌రి హిందీ వాళ్ల వైఖ‌రి అర్ధ‌మ‌వుతుంది. `కేజీఎఫ్` లో వ‌యోలెన్స్ త‌ప్ప ఏమీ లేద‌ని క్రిటిక్స్ విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. వ‌యోలెన్స్ ద్వారా క్రైమ్ రేటు పెరిగిపోతుందంటున్నారు. సౌత్ సినిమాల ద్వారా ఎలాంటి సందేశాలు ఇస్తున్నారో చెప్ప‌రా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

విజ‌యం సాధించని `బీస్ట్` ..`సాహో`..`వ‌లిమై` చిత్రాల గురించి స‌హా బాలీవుడ్ లో కొంద‌రు ఉద్దండులు విమ‌ర్శించ‌డం విశేషం. ప్లాప్ సినిమాల గురించి కూడా మాట్లాడుతున్నారంటే సౌత్ సినిమా ఏ రేంజ్ లో ద‌డ పుట్టించో అర్ధ‌మ‌వుతోంది. రీసెంట్ గా నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా ``పాండమిక్ వల్ల జనాల టేస్ట్ మారిందనుకున్నాను. కానీ అదే రొటీన్ యాక్షన్ సినిమాల్ని ఇష్టపడుతున్నారు. ప్రేక్ష‌కుల‌ టేస్ట్ ఏమాత్రం మారలేదు. కొత్త జాన‌ర్ సినిమాలు చూడ‌టం లేదు`` అంటూ కామెంట్టు చేసారు.