Begin typing your search above and press return to search.

అక్కడ నవాజ్.. ఇక్కడ సునీల్..

By:  Tupaki Desk   |   20 Aug 2016 11:30 AM GMT
అక్కడ నవాజ్.. ఇక్కడ సునీల్..
X
నిజానికి హీరో అవ్వాలంటే ఒడ్డు పొడుగు.. ముఖతీరు.. రంగు.. ఇలా చాలా గుణాలుండాలంటూ ఒకప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది. అలా అన్నివిధాలుగా బాగున్న వారినే హీరోలు అంటారని.. ఇప్పుడు మాత్రం ఎవరు పడితే వారు హీరోలు అయిపోతున్నారని దాసరి నారాయణరావు వంటి వారు చాలాసార్లు కితాబిచ్చారు. కాని ఒక కోణంలో చూస్తే అవన్నీ రేసిస్టు కామెంట్లనే చెప్పాలి. అయితే ఇలాంటి కామెంట్లు ఎన్నివేసినా కూడా.. ఓ ఇద్దరు హీరోలను చూస్తే మాత్రం.. వారు మనకి ఒక లైఫ్‌ టైమ్ కు సరిపోయే ప్రేరణ ఇచ్చారనే చెప్పాల్సి వస్తోంది.

బాలీవుడ్ లో అసలు రంగు లేకపోతే హీరో అవ్వడం కష్టం. కాని కంప్లీట్ ద్రవిడియన్ టింట్ లో ఉన్న యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ.. ఏదో చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు చేసే స్థాయి నుండి ఇప్పుడు ఒక హీరో స్థాయికి ఎదిగాడు. ఎవరేమన్నా కూడా.. ''ఫ్రీకీ ఆలీ'' సినిమాతో తన సత్తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. బాలీవుడ్ లో ఒక పెద్ద సినిమాలో లీడ్ క్యారెక్టర్ (హీరోగా) చేయడమంటే మాటలు కాదు మరి. ఇప్పుడు మన టాలీవుడ్ విషయానికొస్తే.. బొద్దుగా బుజ్జిగా ఉండే సునీల్ కలర్ పైనే దాదాపు చాలా సినిమాల్లో జోకులు పడేవి. ఆ స్థాయి నుండి మనోడు సిక్స్ ప్యాక్ చేసి ఇప్పుడు హీరోగా తన సత్తాను ప్రూవ్ చేసుకుంటున్నాడంటే.. నిజంగానే జీవితంలో చాలా ఎచీవ్ చేసినట్లు. మనకు ఎంతో ఇన్సిపిరేషన్ ఇచ్చినట్లు.

కాకపోతే కంటెంట్ ఎంపిక విషయంలో ఈ ఇద్దరూ కూడా ఈ మధ్యన కాస్త తబడుతున్నారు. వీరు మంచి మంచి సినిమాలను ఎంచుకుని.. మాంచి రేంజు హిట్లు కొట్టి.. సినిమాల చరిత్రను రీ-రైట్ చేస్తారని ఆశిద్దాం.