Begin typing your search above and press return to search.
తప్పును సమర్ధించుకోవడానికి సిగ్గు లేదా?
By: Tupaki Desk | 6 Jun 2020 6:50 AM GMTవిలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తమ్ముడు షమాన్ సిద్దిఖీ గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వివాదాస్పద విషయాల గురించి ప్రచారం జరుగుతూనే ఉంది. నవాజుద్దీన్ రెండవ భార్య ఆలియా ఇప్పటికే తన మరిది గృహ హింసకు పాల్పడ్డాడు అంటూ షమాన్ పై కేసు పెట్టింది. తాజాగా నవాజుద్దీన్ కు వరుసకు కూతురు అయ్యే జమీనా దిల్లీ పోలీసులకు షమాన్ పై ఫిర్యాదు చేసింది. తనను 9 ఏళ్ల వయసు ఉన్న సమయంలో లైంగికంగా వేదించాడు అంటూ ఫిర్యాదు చేసింది.
ఆ విషయమై ఎట్టకేలకు షమాన్ స్పందించాడు. లైంగిక వేదింపులకు పాల్పడినది లేనిది క్లారిటీ ఇవ్వకుండా తనపై కొందరు కావాలని ఈ కేసు పెట్టించారు. గతంలో నవాజుద్దీన్ గురించి మాట్లాడని జమీనా ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతూ ఉందంటే దీని వెనుక ఎవరు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఈ విషయంలో తనను కొందరు కావాలని బ్లేమ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ తన తప్పును సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.
షమాన్ ట్వీట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తప్పు చేయలేదు అంటూ నువ్వు చెప్పడం లేదు. పైగా ఆ తప్పును సమర్ధించుకునేందుకు కొందరు తనపై అబాండాలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఎదురు దాడికి దిగుతున్నావు. ఈ విషయంలో నీకు ఇతరుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ షమాన్ మరింత అనుమానాలకు తెర తీస్తున్నాడు. జమీనా చేసిన ఆరోపణలు నిజం అయ్యి ఉంటాయి అనిపించేలా షమాన్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.