Begin typing your search above and press return to search.

#గుస‌గుస.. స్టార్ హీరోకి భార్య ప‌నిమ‌నిషితో ఏంటీ చికాకులు?

By:  Tupaki Desk   |   23 Feb 2023 6:00 PM GMT
#గుస‌గుస.. స్టార్ హీరోకి భార్య ప‌నిమ‌నిషితో ఏంటీ చికాకులు?
X
ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ డొమెస్టిక్ వ‌యోలెన్స్ సాగా ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇది కూడా దిశా పోలీస్ స్టేష‌న్ లో ఆరోప‌ణ‌ల‌ క‌థ‌ల్లానే రొటీన్ గా సాగుతోంది. దానికి కార‌ణం ఆరంభం న‌వాజ్ పై ఆరోప‌ణ‌లు చేసిన ఇంటి ప‌ని మ‌నిషి ఇప్పుడు తిరిగి అత‌డు చాలా మంచివాడు అంటూ కితాబిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేయ‌డ‌మే.

నవాజుద్దీన్ భార్య ఆలియా న్యాయవాది రిజ్వాన్ సిద్ధికీ ఇటీవల ఒక ట్వీట్ ను షేర్ చేసారు. అందులో సప్నా తన బావకు కొత్త ఐఫోన్ ను బహుమతిగా ఇస్తున్నట్లు కనిపించింది. చెవుల‌కు ప్రకాశిస్తూ ఉన్న ఆభ‌ర‌ణాల‌తో సప్నా కొన్ని రోజుల క్రితం ఈ వీడియోలో క‌నిపించింది. దుబాయ్ లో ఆహారం వంటి కనీస అవసరాలకు కూడా డబ్బు లేకుండా ఊబిలో కూరుకుపోయాన‌ని స‌ప్నా చెప్పినదానికి ఇప్పుడు ఆమె షేర్ చేసిన వీడియోకి సింక్ మిస్స‌యింది.

నవాజుద్దీన్ ను పరోక్షంగా విచారిస్తూ- ఆలియా లాయ‌ర్ రిజ్వాన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో సాప్నా ఇబ్బందిక‌ర స్థితిపై ఫోటోని పోస్ట్ చేసి ``రెండు రోజుల క్రితం సప్నా బాధలో ఉంది. తిండి లేదు.. డబ్బు లేదు.. రెండు నెలలుగా జీతం లేక ఇబ్బంది ప‌డుతోంది`` అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఫోటోని పోస్ట్ చేసిన వెంటనే సప్నా దానిని తొలగించింది. కానీ రిజ్వాన్ అప్ప‌టికే స్క్రీన్ షాట్ తీసుకున్నారు. కొన్ని నిమిషాల క్రితం మేం సాప్నాను సంప్రదించినప్పుడు....``దేవునికి ధన్యవాదాలు.. అది (ఆ ఫోటో) తొలగించకముందే నేను స్క్రీన్ షాట్ తీశాను. లేకపోతే ఇలాంటిది మొదట జరిగిందని మాకు ఎప్పటికీ తెలియదు.`` అని రిజ్వాన్ వ్యాఖ్యానించారు.

అయితే ఆలియా లాయ‌ర్ రిజ్వాన్ వినిపిస్తున్న స్టోరీకి భిన్నంగా ప‌నిమ‌నిషి సప్నా ఒక వీడియోను పోస్ట్ చేసింది. న‌వాజుద్దీన్ కి క్లీన్ చిట్ ఇస్తూ-``తాను ఏది మాట్లాడినా.. ఏం చేసినా విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నా``న‌ని ఆమె చెప్పింది. నేను ఏది చేసినా అది ఎవరి ఒత్తిడికో లోబడి చేసాను. నేను మీకు(న‌వాజ్ కు) చెడు కోరుకోను. మీరు చాలా మంచి వ్యక్తి.. నేను మిమ్మ‌ల్ని క్షమాపణ కోరుతున్నాను..``అని స‌ప్నా ఈ వీడియోలో వ్యాఖ్యానించింది. మొత్తానికి ఫ్యామిలీ మ్యాట‌ర్ లో న‌వాజుద్దీన్ కి ప‌ని మ‌నిషి నుంచి క్లీన్ చిట్ ల‌భించింది. ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు సాక్ష్యాలు ఆధారాలు అంటూ కోర్టులో ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాట‌ర్ న‌లుగుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.