Begin typing your search above and press return to search.
అమ్మాయిగా మారే అబ్బాయి కథ.. 3గంటలు మేకప్ కే!
By: Tupaki Desk | 13 Dec 2022 2:34 PM GMTప్రయోగాలు చేసేందుకు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎప్పుడూ వెనకాడడు. అతడు ఇప్పుడు కూడా అదే బాటలో వెళుతున్నాడు. నవాజుద్దీన్ తదుపరి చిత్రం `హడ్డీ`లో తన పాత్రతో అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. అబ్బాయి అమ్మాయిగా మారితే ఆ తర్వాత పరిణామాలేంటి? అనే ప్రయోగాత్మక కాన్సెప్టుతో రూపొందుతున్న హడ్డీ మూవీలో లింగమార్పిడి లుక్ తో కనిపించనున్నాడు. ఇప్పటికే నవాజుద్దీన్ హిజ్రా(నపుంశకుడు) లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నవాజుద్దీన్.. తనను తాను ఆకలితో ఉన్న ఆర్టిస్ట్ అని అన్నాడు. సరిహద్దులను చెరిపేయడం తన విధానం అని కుండబద్ధలు కొట్టాడు.
`హడ్డీ`లో తన పాత్ర కోసం చాలా ఇష్టంగా శ్రమించానని తెలిపారు. ఈ పాత్ర కోసం ప్రోస్తేటిక్స్ ని ఉపయోగించారు. అమ్మాయిగా పరివర్తనకు సంబంధించిన ఒక వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేయగా వైరల్ గా మారింది. దుర్భరమైన మేకప్ ప్రక్రియ కోసం నవాజుద్దీన్ దాదాపు మూడు గంటల పాటు కుర్చీకే అతుక్కుపోయినట్లు ఈ వీడియోలో వెల్లడించారు.
లుక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఏం చేసారు? అంటే... కోహ్లెడ్ ఐ- లిప్ స్టిక్- పొడవాటి కుర్తా -పొడవాటి జుట్టు విగ్ ని ముందుగా సమకూర్చుకున్నారు. మేకప్ లో రకరకాల కాస్మోటిక్స్ కాస్ట్యూమ్స్ కోసం లక్షల్లో ఖర్చయిందని చిత్రబృందం చెబుతోంది. ప్రయోగాల్లో నవాజుద్దీన్ తర్వాతే. SRKలా నవాజ్ భాయ్ చిత్ర పరిశ్రమలో చాలా కష్టపడి పనిచేసే నటుడు అంటూ ఒక అభిమాని అతడి హార్డ్ వర్క్ ప్రయోగాత్మకత గురించి ప్రశంసించడం విశేషం.
నిజ జీవితంలో ట్రాన్స్ వుమెన్ లతో కలిసి పనిచేయడం హడ్డీలో అద్భుతమైన అనుభవం. వారి ఉనికి సాధికారతను ఇచ్చింది..అని నవాజుద్దీన్ అన్నారు. ``ఒక కళాకారుడిగా.. నటుడిగా నా స్థాయిని పెంచే పాత్రల కోసం నేను ఎప్పుడూ ఆకలితో ఉంటాను. ఆ చిత్రణలో ఎక్కువ భాగం సహజసిద్ధంగా కనిపించేందుకు ప్రయత్నించాను`` అని తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టులో హడ్డీ నుండి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆ సమయంలో మూవీ కథాంశం గురించి నవాజుద్దీన్ హింట్ ఇచ్చారు. ఇది మునుపెన్నడూ చూడని కొత్త తరహా క్రైమ్ డ్రామా. హడ్డీలో మునుపెన్నడూ చూడని అవతార్ లో కనిపిస్తానని తెలిపారు. ఇది నోయిర్ రివెంజ్ డ్రామా కథాంశం. 2023లో సినిమా విడుదల కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Here’s a sneak peek into my transformation in #Haddi#Haddi releasing in 2023.@ZeeStudios_ @AkshatAjay @piyushputy #AdamyaaBhalla #SubhashShinde @ZEE5India @ZeeMusicCompany @zeecinema pic.twitter.com/qgGKGDed7x
— Nawazuddin Siddiqui (@Nawazuddin_S) December 13, 2022