Begin typing your search above and press return to search.

100 కోట్లు తీసుకునే వాళ్ల‌తో ఇండ‌స్ర్టీకి న‌ష్ట‌మే!

By:  Tupaki Desk   |   16 Dec 2022 2:30 AM GMT
100 కోట్లు తీసుకునే వాళ్ల‌తో ఇండ‌స్ర్టీకి న‌ష్ట‌మే!
X
బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీ ప్ర‌యోగాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వెండి తెర‌పై ఆయ‌న చేయ‌ని ప్ర‌యోగ‌మంటూ ఉండ‌దు. వైవిథ్య‌మైన పాత్ర‌ల‌కు పెట్టింది పేరుగా నిలిచిన ఏకైక న‌టుడాయ‌న‌.ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌ట దిగ్గ‌జం. థియేట‌ర్ స‌హా ఓటీటీలోనూ సంచ‌ల‌నం రేపుతున్నాడంటే? అత‌ని ప్ర‌తిభ‌ని కొల‌మానం ఎలా? అత‌ని న‌ట‌న మెచ్చని ప్రేక్ష‌కుడు ఉండ‌డు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ కి వ‌చ్చి ఎదిగిన గొప్ప న‌టుడాయ‌న‌. తాజాగా న‌వాజుస‌ద్దీన్ బాలీవుడ్ ఇండ‌స్ర్టీని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. అత్య‌ధిక పారితోషికం తీసుకునే న‌టుల వ‌ల్ల సినిమాల‌కి న‌ష్టం క‌లుగుతుంద‌ని ఆరోపించారు. ``దీని వ‌ల్ల సినిమా నిర్మాణ వ్య‌యం భారీగా పెరుగుతుంది. చివ‌రికి అది లాభాల‌పై ప్ర‌భావం చూపిస్తుంది.

బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ని గ‌మ‌నించ‌డం నిర్మాత బాధ్య‌త‌. టిక్కెట్ ధ‌ర‌లు..అమ్మ‌కాల గురించి న‌టీన‌టులు బాధ‌ప‌డాల్సిన ప‌నిలేదు. అయినా ఒక న‌టుడు బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది కూడా ఒక‌రక‌మైన అవినీతిగానే భావించాలి. ఎవ‌రైతే 100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారో వాళ్ల వ‌ల్ల ఆ సినిమాల‌కు న‌ష్ట‌మే.

త‌క్కువ బ‌డ్జెట్ తో నిర్మించిన సినిమాలు ఎప్పుడు న‌ష్ట‌పోవు. ఒక‌వేళ న‌ష్టాలు వ‌చ్చినా భారీగా ఉండ‌వు. కానీ కొన్ని సినిమాలకు ప‌రిమితి మించి ఖ‌ర్చు చేస్తున్నారు. ఇది ఏ సినిమాకి అవ‌స‌రం. న‌టులు...ద‌ర్శ‌కులు..ర‌చ‌యిత‌లు కాదు. బ‌డ్జెట్ మాత్రమే సినిమా హిట్ లేదా ప్లాప్ ని డిసైడ్ చేస్తుంద‌న్న‌ది త‌న అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.

చిన్న సినిమాల‌తోనే ప‌రిశ్ర‌మ క‌ళ‌క‌ళ‌లాడుతుందని టాలీవుడ్ సైతం చాలా సంద‌ర్భాల్లో అభిప్రాయ‌ప‌డింది. అగ్ర హీరోల సినిమాలు ఏడాదికి ఒక‌టి రిలీజ్ అయితే చిన్న సినిమాలు.. ప‌రిమిత బ‌డ్జెట్ లో రూపొందిన సినిమాలు స‌క్సెస్ అయితే లాభాలు ఆశించిన దాని కంటే ఎక్కువ‌గా ఉంటున్నాయి. పెట్టుబ‌డి ని మించి రెండింత‌లు లాభాలు చూస్తున్నారు. విష‌యం ఉన్న సినిమా విష‌యంలో ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు బెంగ ప‌డాల్సిన ప‌నిలేద‌ని చిన్న చిత్రాలెన్నో నిరూపించాయి.

ఇక బాలీవుడ్ లో అధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోల‌పై కంగ‌నా ర‌నౌత్ ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. ప‌రిశ్ర‌మ‌లో మేల్ డామినేష‌న్ ఎక్కువ అవుతోందని..వాళ్ల‌తో స‌మాన వేత‌నాలు మాకెందుకు ఇవ్వ‌డం లేద‌ని సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా తారా జువ్వ‌లా ఎగిరిప‌డుతున్నారు. ప్రియాంక చోప్రా..దీపికా ప‌దుకొణే లాంటి వారు కూడా ఈ విష‌యాల‌పై తమ అభిప్రాయాల్ని అంతే ఓపెన్ గా చెప్పిన సంగ‌తి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.