Begin typing your search above and press return to search.
ఫేమస్ నటుడికి విడాకులిచ్చిన భార్య
By: Tupaki Desk | 19 May 2020 8:30 AM GMTసినిమా ఇండస్ట్రీలో ఎంత బాగా బంధాలు కలుస్తాయో.. అంతే వేగంగా విడాకులు తీసుకుంటారు. ఇలా ప్రేమించడం.. అలా వారితో డేటింగ్ చేయడం..వారి వైఖరులు సరిపోక విడిపోవడం చాలా కామన్ గా ఉంటుంది. టాలీవుడ్ లో ఈ ఒరవడి కాస్తా తక్కువ గానీ.. బాలీవుడ్ లో అయితే హీరోలు, హీరోయిన్లు కలిసి విడిపోయిన వారు చాలా మంది ఉన్నారు.
తాజాగా బాలీవుడ్ ఫేమస్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీకి అతడి భార్య ఆలియా సిద్ధిఖీ విడాకులు ఇచ్చిన వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎందుకు విడాకులు ఇచ్చానన్న దానిపై ఆలియా సిద్దిఖీ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించింది. బయటకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలు నాకు నవాజుద్దీన్ తో ఉన్నాయని.. అవన్నీ నేను ఎప్పుడు పబ్లిక్ గా చెప్పలేదని.. పదేళ్ల క్రితం మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సమస్యలు ఉన్నాయని ఆలియా సిద్ధిఖీ తెలిపింది. ఈ నిర్బంధ సమయంలో నాకు చాలా సమయం చిక్కిందని.. ఆత్మ విమర్శ చేసుకునే టైమ్ దొరికిందని.. నవాజుద్దీన్ దగ్గర ఆత్మ గౌరవం పూర్తి కోల్పోయానని వాపోయింది. నా ఐడెంటిటీ లేని దానిలా తయారు చేశాడని.. ఒంటరితనాన్ని అనుభవించానని ఆలియా సంచలన ఆరోపణలు చేసింది.
ఇక నుంచి నవాజుద్దీన్ తో విడిపోయి నా నిజమైన గుర్తింపుకే మళ్లీ పోవాలనుకుంటున్నానని ఆలియా సిద్ధిఖీ తెలిపింది. ఇకపై తన సొంత పేరు అంజనా కిషోర్ పాండేగానే ఉంటానని ఆమె తెలిపింది. ఎవరి ఐడెంటిటీ మీద తాను బతుకనని స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ నవాజుద్దీన్ తో కలవనని.. మా పిల్లల్ని నా కస్టడీలోకే తీసుకున్నానని తెలిపింది. అయితే తన భార్య విడాకులిచ్చిన వ్యవహారంపై నటుడు నవాజుద్దీన్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.