Begin typing your search above and press return to search.
స్టార్ యాక్టర్ పై భార్య సంచలన కామెంట్
By: Tupaki Desk | 22 May 2020 5:45 AM GMTబాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ రెండవ భార్య ఆలియా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆలియా తన భర్త నవాజుద్దీన్‌కు విడాకులు ఇస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. విడాకులతో పాటు అతడి కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించి గృహ హింస కేసును పెట్టింది. తాజాగా ఆలియా మాట్లాడుతూ నవాజుద్దీన్ సిద్దిఖీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడినది.
నవాజుద్దీన్ తన మొదటి భార్యను శారీరకంగా మానసికంగా తీవ్రంగా హింసించేవాడు. ఆ హింసను భరించలేక ఆమె విడాకులు తీసుకుంది. ఆ విషయం నాకు తెలియకుండా జాగ్రత్త పడి నన్ను పెళ్లి చేసుకున్నాడు. నేను మొదట్లో మొదటి భార్య గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాని ఆమె విషయంలో జరిగినట్లుగానే నా విషయంలో కూడా జరుగుతుంది. ఆమెను ఎలా అయితే మానసికంగా శారీరకంగా హింసించారో అలాగో నవాజుద్దీన్ మరియు అతడి కుటుంబ సభ్యులు హింసించారు.
నవాజుద్దీన్ తమ్ముడు షమాన్ నన్ను పలు సందర్బాల్లో హింసించాడు. అతడి కుటుంబం మొత్తం నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేశారు. అందుకే కలిసి జీవించడం సాధ్యం కాదని భావించి విడిపోయేందుకు సిద్దం అయినట్లుగా పేర్కొంది. విడాకుల పత్రాలు వాట్సప్ మరియు మెయిల్ ద్వారా పంపించినట్లుగా పేర్కొంది. ఆలియా ఆరోపణలపై నవాజుద్దీన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.