Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : నాయకి
By: Tupaki Desk | 15 July 2016 4:21 PM GMTచిత్రం : నాయకి
నటీనటులు: త్రిష - సత్యం రాజేష్ - గణేష్ వెంకట్రామన్ - సుష్మా రాజ్ - జయప్రకాష్ - పూనమ్ కౌర్ - జీవా తదితరులు
సంగీతం: రఘు కుంచె
నేపథ్య సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
నిర్మాతలు: గిరిధర్ - పద్మజ
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: గోవి
ఓవైపు చీరలో పద్ధతిగా కనిపిస్తూనే.. మరోవైపు మాసం నరికే కత్తి ఫెరోషియస్ లుక్ లో దర్శనమిస్తూ భలే వెరైటీగా కనిపించింది త్రిష ‘నాయకి’ పోస్టర్లలో. కెరీర్లో తొలిసారి హార్రర్ కామెడీ సినిమాలో నటించడం.. అది కూడా చాన్నాళ్ల తర్వాత ఓ తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి ముందుకు రావడంతో ‘నాయకి’ మొదలైనపుడు జనాల్లో దీనిపై బాగానే ఆసక్తి కలిగింది. అనివార్య కారణాలతో ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
దుండిగల్ అనే ప్రాంతంలో వరుసగా కొందరు వ్యక్తులు అదృశ్యమైపోతుండటంతో ఆ ప్రాంతాన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా ప్రకటిస్తుంది ప్రభుత్వం. అక్కడ ఓ ఆడ దయ్యం (త్రిష) మగాళ్లను ఆకర్షిస్తూ.. వారి ప్రాణాలు తీస్తుంటుంది. తనను ప్రేమించిన సంధ్య (సుష్మ రాజ్) అనే అమ్మాయిని మోసం చేసి అనుభవించడానికి గెస్ట్ హౌస్ వైపు వెళ్తున్న సంజయ్ (సత్యం రాజేష్) కూడా దారి మళ్లి ఆ దుండిగల్ ప్రాంతానికే వెళ్తాడు. అక్కడున్న బంగ్లాలోకి చేరుకున్నాక ఈ జంటకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. సంధ్యను మోసం చేద్దామనుకుంటున్న టైంలో దయ్యం.. సంజయ్ మీద విరుచుకుపడుతుంది. అతను.. సంధ్య ఎటూ వెళ్లలేక ఆ బంగ్లాలోనే ఇరుక్కుపోతారు. ఇంతకీ ఆ దయ్యం ఉద్దేశమేంటి.. అదెందుకు హత్యలు చేస్తుంటుంది.. దాని గతమేంటి.. సంజయ్-సంధ్య ఆ బంగ్లా నుంచి ఎలా బయటపడ్డారు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఒక జానర్లో ఓ సినిమా సూపర్ హిట్టయిందంటే చాలు.. ఇక వరుసబెట్టి అందరూ ఆ మార్గంలోనే కాసులు కొల్లగొట్టేయాలని చూస్తుంటారు. వరుసబెట్టి ఒకే రకమైన సినిమాలు వదిలేస్తుంటారు. ప్రేక్షకులకు కొంత కాలానికే మొహం మొత్తేస్తుంది. హార్రర్ కామెడీల సంగతి కూడా అలాగే తయారైంది. ‘ప్రేమకథా చిత్రమ్’తో పాటు ఇంకొన్ని హార్రర్ కామెడీలు ఆడేశాయని గత రెండు మూడేళ్లలో తెలుగులో చాలా హార్రర్ కామెడీలు తయారయ్యాయి. ఇవి చాలవన్నట్లు తమిళ అనువాదాలు కొన్ని కొన్ని దించేశారు. విచారకరమైన విషయం ఏంటంటే.. ఈ హార్రర్ కామెడీలన్నీ కూడా ఒకే రకంగా ఉండటం. అనగనగా ఓ బంగ్లా.. అందులో ఓ దయ్యం.. దయ్యాలంటే అస్సలు నమ్మకం లేని హీరో తన బ్యాచ్ ను వేసుకుని అందులోకి వెళ్తాడు.. ఆ బ్యాచ్ లో అందరికీ బ్యాండ్ బాజా అయిపోతుంది. చివరికి దయ్యం ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. చివర్లో క్లైమాక్స్. ఇదీ వరస. ‘నాయకి’ కూడా దాదాపుగా ఇదే లైన్లో సాగే సినిమా.
ఇందులో దయ్యానికి సినిమాల పిచ్చి ఉంటుంది. మామూలుగా కనిపించకుండా మొబైల్ కెమెరా ద్వారా చూస్తే మాత్రమే కనిపిస్తుంది. ఇదొక్కటే ఇందులో కొంచెం కొత్తగా అనిపించే పాయింట్. ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. త్రిష.. సత్యం రాజేష్ లాంటి మంచి పెర్ఫామర్లుండటం ‘నాయకి’లో చెప్పుకోదగ్గ విషయం. వీళ్లిద్దరి వల్ల ‘నాయకి’ అక్కడక్కడా కొంచెం ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఎవరైనా దయ్యం ఉన్న బంగ్లా వైపు వెళ్తే.. అది ఆకర్షణీయంగా మారిపోవడం.. లోపలికి వెళ్లాక దయ్యం విశ్వరూపం చూపించడం.. ‘అరుంధతి’ని గుర్తుకు తెస్తుంది. మిగతాదంతా ఇప్పటిదాకా చాలాసార్లు చూసిన హార్రర్ కామెడీల బాపతే. ‘నాయకి’ అనుకున్న స్థాయిలో భయం పుట్టించలేకపోయింది. నవ్వులు కూడా పెద్దగా పండలేదు.
ప్రథమార్ధంలో త్రిష పాత్ర పరిచయం వరకు బాగా అనిపిస్తుంది. మధ్యలో సత్యం రాజేష్ తన ప్రేయసితో కలిసి బంగ్లాలోకి ఇచ్చాక కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. ఐతే ఆ తర్వాత దయ్యం బాదుడు మొదలవగానే ప్రేక్షకుడికి విషయం అర్థమైపోతుంది. ఏ ప్రత్యేకతా లేకుండా రొటీన్ గా సాగిపోయే స్క్రీన్ ప్లే సినిమాను నీరుగార్చేస్తుంది. మామూలుగా హార్రర్ కామెడీల్లో ఒక కామెడీ బ్యాచ్ అయినా ఉంటుంది. ఇందులో అదీ లేదు. ఒక్క సత్యం రాజేష్ మాత్రమే ఉంటాడు. అతను మాత్రం ఎంతసేపని నవ్విస్తాడు. కొంత సమయం గడవగానే సన్నివేశాలు రిపిటీటివ్ గా అనిపిస్తాయి.
ప్లాట్ ఏంటన్నది అర్థమైపోయాక.. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడ్డానికే సరిపోతుంది. కథనం ముందుకు సాగకుండా లాక్ అయిపోవడంతో బంగ్లాలో ఇరుక్కున్న సత్యం రాజేష్ పరిస్థితిలోనే ప్రేక్షకులూ ఉంటారు. ద్వితీయార్ధంలో కామెడీ డోస్ సరిపోదని.. ఇంకో కొత్త పాత్రను ప్రవేశపెట్టాడు దర్శకుడు. ఐతే సప్తగిరి లాంటోళ్లు చేయాల్సిన ఈ పాత్రను మనకు అస్సలు పరిచయం లేని తమిళనటుడెవరినో పెట్టడం పెద్ద పొరబాటు. దీంతో ఆ పాత్రతో చుట్టూ అల్లుకున్న కామెడీ తేలిపోయింది. ఫ్లాష్ బ్యాక్ కూడా మరీ రొటీన్. పైగా దాన్ని అనవసరంగా సాగదీశారు. విలన్ని చంపేముందు భద్రకాళీ అంటూ పాట.. త్రిష డ్యాన్సులు అవీ చికాకు పుట్టిస్తాయి. ఇక్కడే సినిమా పూర్తిగా గాడి తప్పింది. నిజానికి ఫ్లాష్ బ్యాక్ ముగుస్తున్నపుడే క్లైమాక్స్ చూస్తున్న భావన కలుగుతుంది. ఇక ఆ తర్వాత పావుగంట సాగతీతలాగా అనిపిస్తుంది. చివర్లో ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం చేసిందేమీ లేదు. నారా రోహిత్ ఇందులో క్యామియో రోల్ ఎందుకు చేశాడో అర్థం కాదు. మొత్తంగా ‘నాయకి’లో ప్రధాన పాత్రధారుల నటన.. కొన్ని కామెడీ సీన్స్ మినహాయిస్తే చెప్పుకోవడానికి పెద్దగా లేదు.
నటీనటులు:
దయ్యం పాత్రలో త్రిష బాగానే నటించింది. ఆరంభ సన్నివేశాల్లోనే త్రిష తన ప్రత్యేకత చూపిస్తుంది. తన వరకు ఆమె బాగానే చేసింది. సత్యం రాజేష్ కూడా తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించడానికి బాగానే కష్టపడ్డాడు. అమాయకురాలైన అమ్మాయిగా సుష్మ రాజ్ పర్వాలేదనిపించింది. జయప్రకాష్ పాత్రకు తగ్గట్లుగా నటించాడు. పూనమ్ కౌర్ చేసిందేమీ లేదు. గణేష్ వెంకట్రామన్ నెగెటివ్ రోల్ లో తేలిపోయాడు. ఇంతకుమించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు.
సాంకేతికవర్గం:
రఘు కుంచె పాటలేవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. త్రిష పాడిన పాట ఒక్కటే పర్వాలేదనిపిస్తుంది. సాయికార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. జగదీష్ చీకటి కూడా తన కెమెరా పనితనంతో ఆకట్టుకున్నాడు. ఐతే హార్రర్ సినిమాల్లో ఎప్పుడూ చూసే విజువల్సే కనిపిస్తాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు. సినిమాలో మెజారిటీ పార్ట్ ఒకే బిల్డింగ్ లో తీసేశారు. రచయిత.. దర్శకుడు అయిన గోవి.. ఎంచుకున్న ప్లాటే రొటీన్. స్క్రీన్ ప్లే విషయంలో అతను ఏమాత్రం కొత్తగా ఆలోచించలేదు. ఒక ఫార్మాట్ ప్రకారం వెళ్లిపోయాడు. దయ్యం కెమెరాలో కనిపించడం అన్న పాయింట్ మినహాయిస్తే ఇంకేరకంగానూ ‘నాయకి’లో కొత్తదనం చూపించలేకపోయాడు.
చివరగా: నాయకి.. అదే దయ్యం.. అదే హార్రర్.. అదే కామెడీ
రేటింగ్- 1.75/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre