Begin typing your search above and press return to search.
కవలలు వచ్చేశారు..నెట్ ఫ్లిక్స్ ఇంకా మేల్కోదేమీ?
By: Tupaki Desk | 12 Oct 2022 7:31 AM GMTకోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేష్ శివన్ తమ ప్రేమని పెళ్లిపీటెక్కించిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి వివాహం ఈ ఏడాది జూన్ 9న చెన్నై సమీపంలోని మహాబలిపురంలో గల రిసార్ట్ లో అంగరంగ వైభవంగ జరిగింది. ఈ వివాహా వేడుకకు తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హాజరు కాగా సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ వివాహానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ వివాహానికి సంబంధించిన ప్రత్యేక విజువల్స్ తో లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గౌతమ్ మీనన్ నేతృత్వంలో 'నయనతార : బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో నయనతార జర్నీకి జంబంధించిన ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి భారీ మొత్తం చెల్లించిన పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ప్రత్యేక స్ట్రీమింగ్ హక్కుల్ని దక్కించుకుంది. నయనతార, విఘ్నేష్ శివన్ వివాహం అనంతరం ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియోని విడుదల చేసింది.
ఇదిలా వుంటే నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు గత ఆదివారం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తాము తల్లిదండ్రలైనట్టుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించి తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. అంతే కాకుండా మాకు ఇద్దరు ట్విన్ బాయ్స్ జన్మించారని, తమ పిల్లలని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఇద్దు కలవల పాదాలని నయన్, విఘ్నేష్ శివన్ ముద్దాడుతున్న ఫొటోలని అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి కూడా. ఇద్దరు కలవల పిల్లల పాదాలని ముద్దాడుతున్న ఫొటోని పంచుకున్న నయన్, విఘ్నేష్ దంపతులు ఈ ఇద్దరు పిల్లలు ఎలా జన్మించారన్న విషయాల్ని మాత్రం వెల్లడించలేదు.
నయన దంపతులకు పిల్లలు పుట్టినా నెట్ ఫ్లిక్స్ ఇంకా మేల్కోవడం లేదని నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు. నయనతార జర్నీకి జంబంధించిన ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. 'నయనతార : బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ కోసం కోట్లు చెల్లించిన నెట్ ఫ్లిక్స్ త్వరలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించి రెండు నెలలవుతోంది.
తాజాగా నయన దంపతులకు ట్విన్స్ పుట్టినా నెట్ ఫ్లిక్స్ సదరు వీడియో స్ట్రిమింగ్ ని స్టార్ట్ చేయలేదని, పుట్టిన కవలలని కూడా డాక్యుమెంటరీలో కలిపి చూపింస్తారా? ఏంటీ? అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ వర్గాలు మాత్రం నయనకు సంబంధించిన చాలా విషయాలని సదరు డాక్యుమెంటరీలో చూపించబోతున్నామని, ఆ కారణంగానే లేట్ అవుతోందని చెబుతున్నాయట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.