Begin typing your search above and press return to search.
నయన్ కు ప్రత్యామ్నాయం లభించింది
By: Tupaki Desk | 19 Nov 2021 9:34 AM GMTలేడీ సూపర్ స్టార్ నయనతార మొదటి సారి బాలీవుడ్ లో సినిమా చేస్తోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వంలో భారీ చిత్రంలో నయన్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో సినిమా కోసం నయన్ ఎక్కువ డేట్లను కేటాయించాల్సి వస్తుందట. దాంతో ఇప్పటికే తమిళంలో ఆమె కమిట్ అయిన రెండు సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది అంటూ ఇంతకు ముందే వార్తలు వచ్చాయి.
ఇప్పుడు అదే నిజం అన్నట్లుగా ఆమె ఒక సినిమా నుండి తప్పుకోగా మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా యూనిట్ సభ్యులు ఇన్ని రోజులు నయన్ కోసం వెయిట్ చేసి ఇంకా వెయిట్ చేయడం తమ వల్ల కాదని ఆమెకు ప్రత్యామ్నాయంగా శ్రద్దా శ్రీనాథ్ ను ఎంపిక చేయడం జరిగింది.
తమిళ ప్రముఖ దర్శకుడు యువరాజ్ దయాలన్ దర్శకత్వంలో నయనతార ప్రథాన పాత్రలో సినిమా ను అధికారికంగా ప్రకటించారు. కరోనా ఇతర కారణాల వల్ల సినిమా చాలా ఆలస్యం అయ్యింది. సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభించారు.
నయన్ పై కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అనుకోకుండా షెడ్యూల్స్ క్యాన్సిల్ అవ్వడంతో నయన్ డేట్లు మళ్లీ లభించడం లేదు. ఆమె కోసం నెలల తరబడి వెయిట్ చేసినా కూడా బాలీవుడ్ మూవీతో పాటు తన సొంత సినిమాలతోనే ఆమెకు సమయం సరిపోతుందట. ఇంకా ఆమె మూడు నెలల వరకు ఖాళీ లేదని తెలుసుకున్న దర్శకుడు దయాలన్ ఆమెకు ప్రత్యామ్నాయం ను వెదికాడు.
పలువురు హీరోయిన్స్ ను సంప్రదించి కొంత మందిని సంప్రదించిన తర్వాత చివరకు ఆ పాత్రకు నయన్ లా శ్రద్దా శ్రీనాథ్ అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యిందట.
తెలుగు లో జెర్సీ సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది. నటిగా మంచి ప్రతిభ ఉన్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.
తమిళంలో ఈమెకు దక్కిన ఈ అవకాశంతో ముందు ముందు మరిన్ని సినిమాలు కూడా ఈమె ఖాతాలో పడే అవకాశం ఉంది. దయాలన్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. అందుకే ఆయన దర్శకత్వంలో నయన్ నటించేందుకు ఓకే చెప్పింది. కాని ఆమె డేట్లు కుదరక పోవడంతో వదిలేసింది.
ప్రస్తుతం ఆమె దృష్టి అంతా కూడా బాలీవుడ్ ఎంట్రీపైనే ఉన్నట్లుగా తెలుస్తోంది. షారుఖ్ వంటి బిగ్ స్టార్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా నయన్ అక్కడ పవర్ ఫుల్ అండ్ ఫేమస్ స్టార్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా ఈమె రెండు మూడు సినిమా లతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేశారు.