Begin typing your search above and press return to search.
గోవా వేడుకలో `మమ్మీ`లతో ప్రేమ పక్షులు చిలౌట్
By: Tupaki Desk | 15 Sep 2020 2:30 PM GMTజీవితంలో ప్రతి నిమిషాన్ని ఆస్వాధించాలి. ఇదే నయన్-విఘ్నేష్ జంట లైఫ్ గోల్. అది ప్రతి చర్యలోనూ కనిపిస్తుంది. ప్రతి యాక్టివిటీలోనూ ప్రతిధ్వనిస్తోంది. తాజాగా నయన్ తన తల్లిగారి పుట్టినరోజు సందర్భంగా గోవాలో పార్టీని నిర్వహించారు. కాబోయే భర్త విఘ్నేష్ తో కలిసి నయన్ ఎంతో ఆనందంగా ఈ వేడుకల్లో కనిపించింది. ఇది ఒక ప్రత్యేక సందర్భంగా మెమరీగా ఉండాలని భావించిందట ఈ జంట.
ఈ బర్త్ డే పార్టీ నుండి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. విఘ్నేష్ ఇన్ స్టాగ్రామ్ లో స్వయంగా కేక్ కట్ చేస్తున్న ఫోటోని షేర్ చేశారు. ఇందులో విఘ్నేష్ తన తల్లితో పాటు కనిపిస్తాడు. ఇది ఒక సంపూర్ణ కుటుంబ కలయిక అని చెప్పొచ్చు. ``నా ప్రియమైన అమ్మూ శ్రీమతి కురియన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు`` అని విఘ్నేష్ వ్యాఖ్యను జోడించారు.
కొచ్చిలో ఓనం జరుపుకున్న తరువాత విఘ్నేష్ నయనతార వారి కుటుంబ సభ్యులతో కలిసి త్వరగా అక్కడి నుంచి ... వారి అభిమాన ప్రదేశం గోవాలో వాలిపోయారట. ఇంత కంటే మరేదీ మంచి ప్లేస్ కానే కాదు బర్త్ డే పార్టీకి అని భావించారట. అంతకుముందు విఘ్నేష్ తన తల్లి కొలనులో ఎంతో ఆనందంగా కనిపిస్తున్న కొన్ని ఫోటోలను ఒక అందమైన శీర్షికతో పంచుకున్నారు. ``మీ తల్లి ముఖం మీద ఉన్న చిరునవ్వు మీ హృదయంలోని ఆనందానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. మీ తల్లిదండ్రులను సంతోషంగా .. కంటెంట్ ఫుల్ గా ఉంచడం ఆదర్శవంతమైన జీవిత లక్ష్యం!`` అని విఘ్నేష్ అన్నారు.
`నానూమ్ రౌడీ ధాన్` సెట్స్ లో విఘ్నేష్ శివన్- నయనతార తొలిసారి ఒకరినొకరు కలిశారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వారు ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి గడిచేకొద్దీ ఈ జంట అనుబంధం బలంగా మారింది. విఘ్నేష్ ఎప్పుడూ ప్రశంసలు కురిపించడు. తన లేడీలవ్ పై అభినందనలు ఇష్టపడతాడు. ఈ జంట ప్రేమ ఆల్వేస్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.