Begin typing your search above and press return to search.
నయన్ - విగ్నేష్ 6Y లవ్ సెలబ్రేషన్స్
By: Tupaki Desk | 22 Oct 2021 4:39 AM GMTఇటీవల పెళ్లై ఏడేళ్ల తరువాత ఓ క్రేజీ జంట విడిపోతే ఓ కోలీవుడ్ జంట పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తూ ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఆ జంట ఎవరో అర్ధమైందనుకుంటాను. యస్ ..నయనతార.. విగ్నేష్ శివన్ జంట. ఈ జంట ప్రేమాయణం సౌత్ లో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే నిలుస్తోంది. గత ఆరేళ్ల క్రితం మొదలైన వీరి ప్రేమాయణం ఇప్పటికీ అదే జోష్ తో సాగుతోంది.
విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం `నానుమ్ రౌడీదాన్`. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటించింది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలోనే నయనతారకు విగ్నేష్ శివన్ కు మధ్మ స్నేహం మొదలైంది.. అది ఆ తరువాత ప్రేమగా మారింది. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు వుండలేనంత. ఏళ్లు గడుస్తున్నా ఈ జంట పెళ్లిఊసు మాత్రం ఎత్తడం లేదు.
తాజాగా వీరి ప్రేమ ప్రయాణం విజయవంతంగా ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ ప్రేమ జ్ఞాపకాలకు సంబంధించిన కొన్ని ఫొటోలని అభిమానులతో పంచుకున్నారు. కోలీవుడ్లో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నయనతార .. విగ్నేష్ శివన్ గత కొంత కాలంగా సహజీవనాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విగ్నేష్ శివన్ వెల్లడించాడు.
మేము ప్రైవేట్ వ్యక్తులం. మా ఎంగేజ్ మెంట్ ని గ్రాండ్ గా జరుపుకోవాలనుకోలేదు. మా పేరెంట్స్ నిర్ణయం ప్రకారం మా ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. అది ఎప్పుడనేది మా అభిమానులకు తెలియజేస్తాం` అని విగ్నేష్ శివన్ తెలిపారు. ప్రస్తుతం విగ్నేష్ శివన్ `కాతువాకుల రెండు కాదల్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నయనతారతో పాటు సమంత కూడా నటిస్తోంది.