Begin typing your search above and press return to search.
నిర్మాతలకు షాకిస్తున్న స్టార్ హీరోయిన్ రెమ్యూనరేషన్ డిమాండ్స్..
By: Tupaki Desk | 12 Jun 2020 5:30 PM GMTనయనతార.. అంటే సౌత్ ఇండియా మొత్తం తెలియని వారుండరు. ఎందుకంటే అమ్మడు సౌత్ బాషలన్నింటిలో అవకాశాలు దక్కించుకుంటూ తన సత్తా చాటుతోంది. గత కొంతకాలంగా ఈ మలయాళ కుట్టి.. తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసింది. ఆమె రెమ్యూనరేషన్ చూసి నిర్మాతలు నోరెళ్లబెడుతున్నారు. నిజానికి గత కొన్ని సినిమాల నుండి నయనతార మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. కెరీర్ ప్రారంభంలో అందాల ఆరబోతకే పరిమితమైన ఈ భామ.. ఆ తరువాత అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ తన విశ్వరూపం చూపిస్తోంది. నిజానికి తమిళ, తెలుగు భాషలలో లేడీ సూపర్ స్టార్ మారింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన తర్వాత నయనతార స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఈ నటి స్థాయికి తగ్గట్టుగా పారితోషికం డిమాండ్ చేస్తూ.. రేట్లు పెంచుకుంటూ పోతుందని చెప్పాలి. ఎంత రెమ్యూనరేషన్ పెంచినా అమ్మడికి సినిమా అవకాశాలు మాత్రం పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
ప్రస్తుతం నయనతార స్టార్ హీరోలతో పాటు 5-6 కోట్ల వరకు తీసుకుంటుందట. తను ఈ మధ్య చేసిన సినిమాలలో సగం వరకూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కావడం విశేషం. అగ్రనటిగా రాణిస్తున్న నయనతార మరో పలు స్టార్ హీరోల సినిమాలలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. ఇక అవి కూడా భారీ సినిమాలు కావడంతో.. నయన్ తన రెమ్యునరేషన్‌ను ఒక్కసారి భారీగా పెంచేసి నిర్మాతలకు చెప్తుందట. దాదాపు పదేళ్ల పైగా సినిమాలలో అలరిస్తున్న నయనతార మొదట్లో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చింది. గత కొన్నేళ్లుగా గ్లామర్ షో తగ్గించేసి పాత్రలను బట్టే సినిమాలు ఓకే చేస్తోంది. ఇక ఇప్పుడు ఎలాంటి గ్లామర్ పాత్రలు చేయడానికైనా సిద్ధం ఉన్నట్లు సమాచారం. గతంలో లిప్ లాక్ సీన్లు.. బికినీ టైపు కాస్ట్యూమ్ లలో మెరిసిన అనుభవం ఉంది నయన్ కి.. కాబట్టి ఇపుడు అలాంటి గ్లామర్ పాత్రలు తన వద్దకు వస్తే ఓ రేంజ్ లో పారితోషికం అడుగుతుందట. చూడాలి మరి ఈ బ్యూటీ త్వరలో తెలుగులో కనిపించనుందేమో!