Begin typing your search above and press return to search.
సౌత్ క్వీన్ ఎవరో తెలిసిపోయిందిగా
By: Tupaki Desk | 18 March 2016 4:03 AM GMTబాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్వీన్ మూవీని సౌత్ లోకి తెచ్చేందుకు చాలాకాలం నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలనాటి హీరోయిన్ రేవతి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా.. సుహాసినీ మణిరత్నం రీమేక్ వెర్షన్స్ కు మాటలు రాస్తుండడం విశేషం. తెలుగు - తమిళ్ - మలయాళ భాషల్లో రూపొందే క్వీన్ రీమేక్ కు.. తెలుగు - తమిళ్ వెర్షన్లకు డైలాగ్స్ ను సుహాసిని రాస్తున్నారు.
అయితే బాలీవుడ్ లో కంగనా రనౌత్ పోషించిన పాత్రను.. ఇక్కడ ఎవరు చేస్తారన్నదే పెద్ద క్వశ్చన్ గా మిగిలిపోయింది. మొదట ఈ ఆఫర్ త్రిషకు ఇవ్వగా.. ఆమె నో చెప్పేయడంతో.. చాలాకాలం పాటు ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉండిపోయింది. ఆ తర్వాత సౌత్ లో ఫుల్ ఫాంలో ఉన్న నయనతారను అడగడం జరిగినా.. ఆమె కూడా తిరస్కరించడంతో.. ఇక క్వీన్ రీమేక్ కు వేరే తారను వెతుక్కోవాల్సి వచ్చింది. పెర్ఫామెన్స్ కు మాత్రమే స్కోప్ ఉండే ఈ రోల్ ను చేసే హీరోయిన్ ని వెతకడం.. టఫ్ టాస్క్ అయిపోయింది మేకర్స్ కి.
కానీ ఇప్పుడు ప్రేమమ్ చిత్రంతో ఆకట్టుకుని, తర్వాత చార్లీ అనే రొమాంటిక్ ఎంటర్టెయినర్ తో నటిగా తన స్పెషాలిటీ ప్రూవ్ చేసుకున్న పార్వతి కి ఈ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. నిజానికి ప్రేమమ్ - చార్లీ చిత్రాలను గమనిస్తే.. నయనతార కంటే క్వీన్ గా పార్వతినే కరెక్ట్ ఛాయిస్ అనిపిస్తుంది. రాణి ఎవరో తెలిసిపోయింది కాబట్టి... ప్రాజెక్టును పట్టాలెక్కించడమే లేట్.