Begin typing your search above and press return to search.
కాబోయేవాడితో గోవా పార్టీ చిలౌట్ కి 25లక్షలు విసిరేసిందట
By: Tupaki Desk | 26 Sept 2020 2:00 PM ISTనాయికా ప్రధాన సినిమాల్లో నటించడంలో లేడీ సూపర్ స్టార్ నయనతార రేంజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ గా వెలిగిపోతోంది. కొద్ది రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివాన్ తో కలిసి ఒక చిన్న సెలవు పై గోవాకు వెళ్లిన సంగతి తెలిసినదే. నయన్ తన బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజును కూడా జరుపుకుందని మేము ఇప్పటికే నివేదించాము. సినీ పరిశ్రమలో తాజా సంచలనం ప్రకారం.. గోవా లో మూడు రోజుల పర్యటన కోసం నయనతార 25 లక్షల రూపాయలు ఖర్చు చేసిందట. ఇది తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
విఘ్నేష్ శివన్ 35 వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి నయనతార రాజీకి రాకుండా అంత భారీగా ఖర్చు చేసినట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. విఘ్నేష్ శివన్ - నయనతార దక్షిణ భారత చలనచిత్రాల అభిమానులచే ఎక్కువగా ఆరాధించబడిన జంటగా పాపులరయ్యారు. ఈ జోడీ 4 సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల నయన్ - విఘ్నేష్ శివన్ గోవా నుండి ఛాయాచిత్రాలను పంచుకున్నారు. అక్కడ ఇద్దరి స్నేహితులు కూడా పుట్టినరోజు వేడుకల్లో గడిపారు.
ప్రేమ పక్షులు ఇటీవల నయనతార తల్లి పుట్టినరోజును కూడా జరుపుకున్నాయి. వారు నయనతార తల్లి కోసం ఆత్మీయ పార్టీని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నయన్- విఘ్నేష్ మదర్స్ ఇరువురూ ఎరుపు పసుపు రంగు చీరలు ధరించారు. నయన్ మాతృమూర్తి కేక్ కట్ చేసి విఘ్నేష్ చప్పట్లు కొట్టి ఆమెను ఉత్సాహపరిచడం ఫోటోల్లో కనిపించింది. నయన్ - విఘ్నేష్ త్వరలో పెళ్లితో ఒకటి కానున్నారని..ప్రచారమైనా ఇప్పట్లో పెళ్లి కార్డు ఇవ్వలేమని కెరీర్ బిజీలో ఉన్నామని వారు చెప్పారు.