Begin typing your search above and press return to search.

నయన్​ బర్త్​ డే విషెష్​ లో ఇదెంతో స్పెషల్​..డిగ్రీ క్లాస్​మేట్​ దుమ్ములేపాడు..!

By:  Tupaki Desk   |   20 Nov 2020 10:39 PM IST
నయన్​ బర్త్​ డే విషెష్​ లో ఇదెంతో స్పెషల్​..డిగ్రీ  క్లాస్​మేట్​ దుమ్ములేపాడు..!
X
ఇటీవల (నవంబర్​ 18) న దక్షిణాది లేడీ సూపర్​స్టార్​, అందాలనటి నయనతార తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు, నయన్​కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ప్రియుడు విఘ్నేశ్​ శివన్​ ఆమె పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. 36 ఏళ్ల నయనతార ఇప్పటికీ తన అందం, అభినయంతో అలరిస్తున్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించే దర్శకులు ఉన్నారు. ఆమె సినిమా కోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారు.

జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా ధైర్యంగా తట్టుకొని నిలబడ్డారు నయన్​. ఇప్పటికీ ఆమె కుర్ర హీరోయిన్లతో పోటీగా సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అటు యువహీరోలతోనూ, ఇటు సీనియర్​ హీరోలతోనూ నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఏ రకమైన పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోవడం నయన్​ స్పెషాలిటి. లేడీ ఓరియంటెడ్​ పాత్రల్లోనూ, గ్లామర్​ పాత్రల్లోనూ అదరగొడుతున్నారు. కాగా ఇటీవల జరుపుకున్న పుట్టినరోజు సందర్భంగా నయనతార డిగ్రీ క్లాస్​మెట్​ కేరళకు చెందిన మహేష్ కదమ్మనిట్ట పెట్టిన పోస్ట్​ ఇప్పుడు సోషల్​మీడియాలో తెగ వైరల్​ గా మారింది.

నయన్​ క్లాస్​మెట్​ పోస్ట్​లో ఏముందంటే..
‘నేను, నయన్​ కేరళలోని తిరువల్లోని మార్తోమా కాలేజీలో డిగ్రీ క్లాస్​మేట్స్​. క్లాస్​రూమ్​లో నా పక్కనే కూర్చొనే నయన్ ఇంత పెద్ద స్టార్​ అవుతుందని నేనెప్పుడు ఊహించలేదు. నెపొటిజం, పురుషాధిక్యం ఉండే సినీ పరిశ్రమలో.. ఏ సపోర్ట్​ లేని ఓ యువతి రాణించడం నిజంగా గొప్ప విషయం. నిజానికి ఆమె కెరీర్​ ప్రారంభంలో విమర్శలే ఎదుర్కొన్నారు. కానీ పరిశ్రమ మీద గౌరవంతో విమర్శలన్నింటినీ అధిగమించింది. పరిపూర్ణమైన కృషి అంకితభావం వల్లనే ఆమె విజయతీరాలకు చేరింది. 17 ఏళ్లుగా పరిశ్రమలో అగ్రస్థానంలో ఉండటం అద్భుతం. తిరువల్లలోని చిన్న గ్రామం నుండి వచ్చి, కృషి పట్టుదలతో ఇంతటి ఘనతను సాధించిన మై డియర్‌ డయానా(నయనతార).. నీకు వేనవేల పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ మహేశ్​ ఫేస్​బుక్​లో పోస్ట్​ పెట్టారు. ఈ పోస్ట్​ ప్రస్తుతం వైరల్​గా మారింది. ఈ సందర్బంగా అతడు మార్తోమా కాలేజీలో 2002-05 నాటి ఆంగ్ల సాహిత్య బ్యాచ్‌లో నయన తార చేతి రాతతో ఉన్న నోట్‌ను కూడా షేర్‌ చేశారు.