Begin typing your search above and press return to search.
నయన్ నెంబర్ వన్ రెమ్యునరేషన్
By: Tupaki Desk | 21 July 2022 3:30 AM GMTఇటీవల కాలంలో హీరోయిన్స్ కూడా రెమ్యునరేషన్స్ ఒక్కసారిగా పెంచేస్తున్నారు. ఒకప్పుడు రెండు మూడు సినిమాలు సక్సెస్ అయితే గానే మరో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ పెంచేవారు కాదు.
కానీ ఇప్పుడు మాత్రం ఒక్క సినిమా హైప్ క్రియేట్ చేసే క్రమంలోనే ముందస్తుగానే అత్యధిక పారితోషికాన్ని డిమాండ్ చేస్తూ ఉండడం విశేషం. ఇక నయనతార కూడా గత కొంతకాలంగా తన పారితోషికాన్ని మెల్లగా పెంచుకుంటూ వెళుతుంది.
కానీ ఇటీవలనే తన 75వ సినిమాకు మాత్రం ఊహించిన విధంగా రేటును ఒక్కసారి డబుల్ చేసేసినట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు ఏ భాషలో సినిమా చేసినా కూడా నయనతార ఐదు కోట్ల పారితోషికాన్ని అందుకుంటూ వచ్చింది. ఇక ఆమె త్వరలోనే తన 75వ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి తీసుకురానుంది.
శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు జీ స్టూడియోస్ ఈ ప్రతిష్టాత్మక నిర్మించనున్నాయి.
అయితే ఈ ప్రాజెక్టు కోసం నయనతార ఏకంగా 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఈ తరహాలో రెమ్యూనరేషన్ అందుకున్నది లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ప్రస్తుతం కొంతమంది అంతకుమించి ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతార ఒకేసారి 10 కోట్లు అడగడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక విధంగా నిర్మాతలు కూడా ఆ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఈ బ్యూటీకి అడిగినంత వారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. అలాగే నయనతార మరోవైపు బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్లో రానున్న జవాన్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.