Begin typing your search above and press return to search.

'గాడ్ ఫాదర్' లో సత్యప్రియ జైదేవ్ గా నయన్ ఫస్ట్ లుక్..!

By:  Tupaki Desk   |   8 Sep 2022 5:30 AM GMT
గాడ్ ఫాదర్ లో సత్యప్రియ జైదేవ్ గా నయన్ ఫస్ట్ లుక్..!
X
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''గాడ్ ఫాదర్''. మోహన్ రాజా దర్శకత్వంలో హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఈరోజు గురువారం 'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార క్యారెక్టర్ ను రివీల్ చేసిన మేకర్స్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఆమె సత్యప్రియ జైదేవ్ అనే పాత్రను పోషిస్తోందని తెలిపారు. ఈ పోస్టర్ లో నయన్ కాటన్ లినెన్ చెకర్డ్ చీరలో సాంప్రదాయకంగా కనిపిస్తోంది. ఆమె టైప్‌ రైటర్‌ లో లెటర్ ను సిద్ధం చేస్తూ ఇంటెన్స్ గా చూస్తోంది.

నయనతార ఇంతకుముందు 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు వీరిద్దరూ 'గాడ్ ఫాదర్' మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కాకపోతే నయన్ ఇందులో చిరు కు జోడీగా నటించడం లేదు. కథలో కీలకమైన పాత్రలో మాత్రమే ఆమె కనిపించనుంది.

ఇకపోతే 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే మెగాస్టార్ పాత్రను పరిచయం చేసే గ్లిమ్స్ - ఫస్ట్ లుక్ మరియు టీజర్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ రాబోతున్నాయి.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ లో స్పెషల్ రోల్ లో నటించారు. ఇది కండలవీరుడికి టాలీవుడ్ డెబ్యూ. సత్యదేవ్ - సునీల్ - పూరి జగన్నాధ్ లతో పాటుగా మరికొంతమంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు.

కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ & సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆర్‌బి చౌదరి మరియు ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా.. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

'గాడ్ ఫాదర్' చిత్రాన్ని 2022 దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.