Begin typing your search above and press return to search.
పెళ్లికి సెంచరీతో ముడి పెట్టిన స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 14 Feb 2019 11:38 AM GMTసౌత్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో నయనతార పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళం మరియు తెలుగులో పెద్ద సినిమాల్లో నటిస్తున్న నయన తార సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఒక వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే మరో వైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ వారితో రొమాన్స్ చేస్తూ వస్తోంది. ఇక ఈమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే నయనతార రెండు లవ్ ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొంది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది.
ప్రేమ విషయం బహిరంగంగా ప్రకటించకున్నా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అనే విషయం ఖరారు అయ్యింది. పెళ్లి కాకుండానే వీరిద్దరు కలిసి జీవితాన్ని సాగిస్తున్నారు. లివింగ్ రిలేషన్ షిప్ లో వీరిద్దరు ఉన్నట్లుగా తమిళ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రేమ విషయాన్ని, లివింగ్ రిలేషన్ షిప్ కు సంబంధించిన వార్తలను నయన్ కాని, విఘ్నేష్ కాని కొట్టి పారేయలేదు. దాంతో ఇద్దరి వ్యవహారం చాలా దూరం వెళ్లినట్లుగా అంతా అంటున్నారు. ఇక పెళ్లి విషయంలో మాత్రం నయన్ చాలా సీరియస్ గా ఉందట.
నయన్ హీరోయిన్ గా 100 సినిమాలు చేయాలనే టార్గెట్ పెట్టుకుందట, హీరోయిన్ గా సెంచరీ కొట్టినప్పుడే పెళ్లి చేసుకోవాలని భావిస్తుందట. అప్పటి వరకు ప్రియుడు విఘ్నేష్ శివన్ తో లివింగ్ రిలేషన్ షిప్ కొనసాగించాలని భావిస్తుందట. నయన్ ఇష్టానుసారంగానే వెళ్లాలని విఘ్నేషన్ కూడా భావిస్తున్నాడని, నయన్ ఓకే ఎప్పుడు చెబుతుందా అని ఎదురు చూస్తానంటూ విఘ్నేషన్ సన్నిహితుల వద్ద చెబుతున్నాడట. నయన్ సినిమాల సంఖ్య 60 దాటింది. మరో 40 సినిమాలు చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కెరీర్ కాస్త అటు ఇటు అయితే అసలు వంద సినిమాలు అవుతాయో కాదో కూడా చెప్పలేం. సెంచరీ కొట్టలేక పోతే నయన్ ఏం చేస్తుందో మరి..!