Begin typing your search above and press return to search.

ప్రభుదేవాతో బ్రేకప్‌ తర్వాత.. ఫస్ట్‌ టైమ్ నయన్‌ రెస్పాన్స్

By:  Tupaki Desk   |   17 April 2021 11:30 AM GMT
ప్రభుదేవాతో బ్రేకప్‌ తర్వాత.. ఫస్ట్‌ టైమ్ నయన్‌ రెస్పాన్స్
X
సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌.. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. శింబుతో లవ్‌ బ్రేకప్‌.. ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమ పెళ్లి వరకు వెళ్లడం సినిమాలకు గుడ్‌ బై చెప్పాలనుకోవడం వంటి సంఘటనలు చాలా చాలానే జరిగాయి. ప్రభుదేవాతో పెళ్లి కోసం సినీ కెరీర్‌ ను పూర్తిగా త్యాగం చేసేందుకు సిద్దం అయ్యింది. బాలకృష్ణ నటించిన శ్రీరామ రాజ్యం సినిమా నే నయనతారకు చివరి సినిమా అనుకున్నారు. ఆ సినిమా షూటింగ్‌ చివరి రోజు నయనతార కన్నీరు పెట్టుకోవడం అప్పట్లో ఎంతటి సెన్షేషనో అందరికి తెల్సిందే. అనూహ్యంగా ప్రభుదేవాతో పెళ్లి చివరి నిమిషంలో క్యాన్సిల్‌ అవ్వడం వల్ల మళ్లీ సినిమా ల్లో నటించి ఆమె ఈసారి లేడీ సూపర్‌ స్టార్ ట్యాగ్‌ ను దక్కించుకుంది.

ప్రభుదేవాతో బ్రేకప్‌ తర్వాత నయనతార పెద్దగా మీడియా ముందుకు రాలేదు. అసలు ఆ విషయం గురించి ఆమె ఎప్పుడు స్పందించలేదు. దాంతో ఇద్దరి పెళ్లి పీఠల వరకు వెళ్లి ఎందుకు ఆగింది అనే విషయంలో ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. ఇటీవల ఒక సందర్బంలో ఆమె స్పందించారు. బ్రేకప్‌ తర్వాత ఏం జరిగిందనే విషయమై ఆమె మాట్లాడుతూ.. జీవితంలో చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. వ్యక్తిగా నాలో చాలా మార్పులు వచ్చాయి. నాలో వచ్చిన మార్పులు చెడ్డవా మంచివా అనేది చెప్పలేను కాని నా మార్పు నా జీవితాన్ని మార్చేసింది. సాదారణంగానే ఒక వ్యక్తి మన జీవితం నుండి దూరం అయితే ఖచ్చితంగా మార్పులు వస్తాయి.. అదే నాకు కూడా జరిగింది.

ఆ సంఘటన తర్వాత జీవితం తలకిందులు అయ్యిందని.. మొత్తం చీకటిగా అనిపించింది. ఏం చేయాలో పాలుపోలేదు. మానసికంగా నేను దెబ్బ తిన్న నేపథ్యంలో నాకంటూ ఒక లైఫ్‌ ఉందని గుర్తించాను. దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని భావించాను. ఆ గుణపాఠాలను బాగా స్వీకరించానంటూ చెప్పుకొచ్చింది. ఇకపై నాకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ధీటుగా ఎదుర్కొనే సత్తాను నా జీవితంలో జరిగిన సంఘటనలు నాకు ఇచ్చాయి. అందుకే ప్రతి ఒక్క సందర్బంలో కూడా నాకు నేను బలంగా తయారవుతూ వచ్చి ఇలా మీ ముందు ఉన్నానంటూ నయనతార చెప్పుకొచ్చారు.