Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీపై ఇంత దమ్ముగా నయన్ మాత్రమే మాట్లాడగలదేమో?

By:  Tupaki Desk   |   7 Oct 2019 7:34 AM GMT
ఇండస్ట్రీపై ఇంత దమ్ముగా నయన్ మాత్రమే మాట్లాడగలదేమో?
X
కొన్ని ప్రశ్నలు కొందరు నోటి నుంచి రావటానికి కూడా ఇష్టపడని వాతావరణం ఉంటుంది. అయితే.. అలాంటి వాటిని ఎప్పుడో ఒకప్పుడు.. ఎవరో ఒకరు బ్రేక్ చేసి సంచలనంగా మారతారు. అప్పటివరకూ ఎవరూ చేయని పనిని.. తాము చేస్తూ.. మిగిలిన వారి కంటే తామెంత భిన్నమన్న విషయాన్ని స్పష్టం చేస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తారు టాప్ నటి నయనతార.

ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా..ఇప్పటికి డిమాండ్ తగ్గని నటిగా నయన్ కున్న పేరు అంతా ఇంతా కాదు. కాలం గడిచే కొద్దీ.. కర్పూరం మాదిరి నటీమణుల ఇమేజ్ కరిగి ఆవిరైపోతుందన్న మాటకు నయన్ మినహాయింపుగా చెప్పాలి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ.. ఆమె వైఖరి మిగిలిన వారికి భిన్నంగా ఉండటమే కాదు.. ఆమె మాటలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.

తాజాగా ఆమె ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ఈ కోవకు చెందేవే. సినిమా ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ అంటారని.. అయితే పవర్ ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలని సూటిగా ప్రశ్నించారు. ఓపక్క టాప్ హీరోలతో జత కడుతూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీలు చేయటం నయన్ కు మాత్రమే సాధ్యమైన ఫీట్ గా చెప్పాలి.

అవసరమైతే కావాల్సినంత గ్లామర్ ను.. అదే సమయంలో హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే యాక్షన్ పాత్రల్ని అవలీలగా పోషించే నయనతారా.. తాజాగా తన తీరు మరింత అర్థమయ్యేలా మాట్లాడారు. అధికారం ఎప్పుడూ మగవాళ్ల దగ్గరే ఎందుకు ఉండాలి? నేను సోలో హీరోయిన్ గా చేసే సినిమాల్లో తుది నిర్ణయాలన్నీ నావే. మహిళలు శాసించే స్థానంలో ఉన్నప్పడూ వారిలో ఉండాల్సినంత కాన్ఫిడెన్స్ ఉండదు. నాకిది కావాలి.. నేనిది చేస్తానని ధైర్యంగా నిలబడరు. కానీ.. ఇది తప్పు. నేను నీ మాట విన్నప్పుడు.. నువ్వు కూడా నా మాట వినాలి కదా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

నయన్ మాటలు విన్నంతనే దివంగత అమ్మ జయలలిత చప్పున గుర్తుకు రాక మానదు. మేల్ డామినేషన్ ను ప్రశ్నించటమే కాదు.. వారిని ఆమె ఎంతగా శాసించారో తెలిసిన విషయమే. మేల్ డామినేషన్ మీద ఇంత క్లారిటీగా మాట్లాడే ప్రముఖ నటి నయన్ అవుతుందంటున్నారు. తనకున్న ఇమేజ్ తో నయన్ రానున్న రోజుల్లో రాజకీయ రంగంలోకి రానున్నారా? అన్న ప్రశ్న మదిలో మెదిలా ఆమె మాటల తీవ్రత ఉందని చెప్పక తప్పదు.